https://oktelugu.com/

Prabhas: పాన్ ఇండియాలో ప్రభాస్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ప్రభాస్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మరి ప్రభాస్ తర్వాత ఏ హీరో ఉన్నాడు అనే విషయం తెలుసుకోవడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే నెంబర్ 2 పొజిషన్ లో బాలీవుడ్ బాద్షా అయిన షారుక్ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన వరుసగా పఠాన్, జవాన్ సినిమాలతో 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన సినిమాలను చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : September 21, 2024 / 04:15 PM IST

    Prabhas(4)

    Follow us on

    Prabhas: తెలుగు సినిమా హీరోగా పెను ప్రభంజనాన్ని సృష్టించిన నటుడు ప్రభాస్… ఇక బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తను ఏ సినిమా చేసిన కూడా బాలీవుడ్ లో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా, భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు సాగడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్క బాలీవుడ్ హీరోను కలవర పెడుతుంది. నిజానికి ప్రభాస్ లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మరి ప్రభాస్ తర్వాత ఏ హీరో ఉన్నాడు అనే విషయం తెలుసుకోవడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే నెంబర్ 2 పొజిషన్ లో బాలీవుడ్ బాద్షా అయిన షారుక్ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన వరుసగా పఠాన్, జవాన్ సినిమాలతో 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన సినిమాలను చేశాడు.

    ఇక ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టిన హీరోలు లేకపోవడంతో ఆయన ప్రభాస్ తర్వాత స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు దేవర, పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలతో ఎన్టీయార్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా భారీ రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళు కనక ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ సాదించినట్లైతే వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. ఇక ఇప్పటికైన మన స్టార్ హీరోలు మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం లో ఉన్నారు.

    ఇక పాన్ ఇండియాలో వస్తున్న సినిమాలు కావడంతో ఈ సినిమాల మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను ఈ సినిమాలపై ఇప్పటికే భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ నెల 27వ తేదీన రాబోతున్న దేవర సినిమాతో రికార్డులు కొల్లగొట్టడం పక్క అంటూ ఎన్టీఆర్ ఇప్పటికే చాలా వరకు మంచి కాన్ఫిడెంట్ తో కనిపిస్తున్నాడు. ఇక పుష్ప 2 తో అల్లు అర్జున్ కూడా రికార్డులు బ్రేక్ చేయాలని చూస్తున్నాడు…గేమ్ చేంజర్ సినిమాను కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు.

    కాబట్టి వీటితో కూడా భారీ సక్సెస్ ని అందుకోవాలని రామ్ చరణ్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది… వీళ్ళు ముగ్గురు కనక భారీ సక్సెస్ ని అందుకున్నట్లైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో మరింత ముందుకు వెళ్లడమే కాకుండా ఈ ముగ్గురు హీరోలకు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం అయితే దక్కుతుంది…