Akkineni Nageswara Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావు చేసిన సినిమాలకి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. ఇక ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో సూపర్ సక్సెస్ అయినా హీరో నాగేశ్వరరావు…అయితే ఒకప్పుడు తెలుగులో నాగేశ్వరరావుకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇక ఈ క్రేజ్ ని వాడుకుంటూ ఆయన తమిళ ఇండస్ట్రీకి వెళ్తాడు అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. కానీ నాగేశ్వరరావు మాత్రం తమిళ ఇండస్ట్రీ మీద పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు. ఇక తెలుగు సినిమాల మీదనే ఆయన ఎక్కువగా ఫోకస్ చేశాడు.
ఇక తన సినిమాలని తమిళంలో కూడా డబ్ చేయలేదు. అందువల్లే ఆయన తమిళంలో హీరోగా ఎదగలేకపోయాడు. ఇక దానికి కారణం ఏంటి అంటే ఆయన తమిళ్ కి వెళ్దాం అనుకున్నప్పుడే తమిళ్ ఇండస్ట్రీలో జెమినీ గణేషన్ వరుస సక్సెస్ లతో ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఇలాంటి సందర్భంలో అక్కడికి వెళ్లి సినిమాలు ఫ్లాప్ అయితే బంగపడే కన్నా సినిమా రిలీజ్ చేయకుండా ఓన్లీ తెలుగులోనే సినిమాలు చేసుకుంటే బెటర్ అని డిసైడ్ అయిపోయాడట. ఇక అందుకే తను తమిళం లో సినిమాలను డబ్ చేయడం గాని, తమిళం లో స్ట్రెయిట్ సినిమా చేయడం గాని చేయలేదట…
మొత్తానికైతే నాగేశ్వరరావు దాదాపు 50 సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున అలాగే ఆయన కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళ మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు నాగేశ్వరావు నాగార్జున కెరియర్ ని బిల్డ్ చేయడానికి చాలా వరకు కష్టపడ్డాడు. ఆయన కష్టం వల్లే నాగార్జున ఇప్పటికి టాప్ పోజిషన్ లో ఉన్నాడనే చెప్పాలి.
ఇక నాగార్జున మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికి నాగేశ్వరావు వాటిని పట్టించుకోకుండా తన కొడుకుని స్టార్ హీరోను చేయాలని ముందుకు కదిలాడు…ఇక అందులో భాగంగానే ఆయన స్టార్ హీరోగా ఈరోజు మన అందరి చేత కీర్తింపబడుతున్నాడు…