https://oktelugu.com/

Nagarjuna: అర్థరాత్రి నాగార్జునకి ఫోన్ చేసే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

నిజంగా తండ్రికి తగ్గ తనయుడుగా కూడా పేరు సంపాదించుకున్నాడు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ పరువును తన భుజాల పైన మూసుకుంటూ వస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 8, 2024 / 02:45 PM IST

    Nagarjuna

    Follow us on

    Nagarjuna: తెలుగులో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని మంచి విజయాలను అందుకున్న హీరో నాగార్జున.. లవ్ స్టోరీ, మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్, థ్రిల్లర్, భక్తిరస చిత్రాలు ఇలా జానర్ ఏదైనా అందులో నటించి మెప్పించాడు. ఇక నాగార్జున ఒకప్పుడు మంచి సక్సెస్ లను అందుకున్నాడు. నిజంగా తండ్రికి తగ్గ తనయుడుగా కూడా పేరు సంపాదించుకున్నాడు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ పరువును తన భుజాల పైన మూసుకుంటూ వస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే నాగార్జున ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమా సమయంలో అందులో హీరోయిన్ గా నటించిన టబు(Tabu) తో చాలా సన్నిహితంగా ఉండేవారట. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని మీడియాలో చాలా కథనాలు అయితే వచ్చాయి. ఇప్పటికి కూడా దానిమీద చాలామంది చాలా రకాల కామెంట్లు అయితే చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయం మీద నాగార్జున స్పందిస్తూ టబు నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. అలాగే అమలకి కూడా టబు మంచి ఫ్రెండ్.. ఇక మా ఇంటి ముందే టబు కి కూడా హౌజ్ ఉంది తను హైదరాబాద్ ఎప్పుడొచ్చినా కూడా మా ఇంటికి వస్తుంది,మా ఫ్యామిలీ వాళ్లతో బాగా మాట్లాడుతుందని చెప్పాడు.

    అలాగే తను ఇప్పటికీ కూడా టబు తో ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తున్నని చెప్పాడు. అలాగే టబు పర్సనల్ విషయాలు గురించి కూడా మాట్లాడుతూ ఆమె ఎప్పుడూ డిప్రెషన్ లో ఉన్నా కూడా ఏ నైట్ అయినా ఇంట్లో ఉండే పర్సనల్ నెంబర్ కి ఫోన్ చేసి నాతో మాట్లాడుతుందని దానివల్ల ఆమెతో మాట్లాడి డిప్రెషన్ లో ఉంటే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పాడు…

    అలా నాగ్, టబు మధ్య మంచి ఫ్రెండ్షిప్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉండడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక అంతకుమించి వీళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని నాగార్జున చెప్పిన మాటలను బట్టి చూస్తే మనకు అర్థం అవుతుంది…