NTR: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ వాళ్ళ కెరియర్ ని చాలా బిజీగా మార్చుకుంటు ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది నటులకి వాళ్ల ఫేవరెట్ నటులు కూడా ఉంటారు.అందులో ముందుగా మన స్టార్ హీరోలందరికి వాళ్ళ నాన్నలు, తాతలు ఫేవరెట్ నటులుగా ఉన్నప్పటికీ, వీళ్ళు వాళ్ళను మాత్రమే కాకుండా వేరే హీరోలను కూడా అభిమానిస్తూ ఉంటారు.
ఇక ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గురించి చూసుకుంటే ఆయనే అద్భుతమైన నటుడు, ఏ పాత్రనైనా సరే ఈజీగా చేసేస్తాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో నటన పరంగా ఎన్టీయార్ కి బాగా నచ్చిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఇక ఈ విషయాన్ని ఆయనే చాలా సార్లు చెప్పారు. నిజానికి ఎన్టీఆర్, మహేష్ బాబు కి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది.
ఇద్దరు కూడా అన్నదమ్ముల లాగా కలిసి మెలిసి ఉంటారు.ఇక అందులో భాగంగానే మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. అది కూడా మహేష్ బాబు చెప్పడం వల్లే వచ్చినట్టుగా ఆయన తెలియజేశాడు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబుకి మంచి అభిమాని అనే విషయం ఆయనే చాలాసార్లు చెప్పారు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా మహేష్ బాబు మాత్రం రాజమౌళితో చేయబోయే సినిమాకు సంబంధించిన మేకోవర్లో బిజీగా గడుపుతున్నాడు.
ఇక రీసెంట్ గా జర్మనీ నుంచి వచ్చిన మహేష్ బాబు కొత్త లుక్ లో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు బాడీకి సంబంధించిన మేకోవర్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళి చెప్పినట్టు గా ఈ సినిమాలో మహేష్ బాబు కి సిక్స్ ప్యాక్ వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…