Mumaith Khan: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన ఐటం గల్ ముమైత్ ఖాన్. ఎన్నో ఐటం సాంగ్స్ చేస్తూ యూత్ తో బాగా కనెక్ట్ అయింది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి సినిమాతో ఈ అమ్మడు రేంజ్ మరింత పెరిగింది. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే సాంగ్ తో యూత్ ను ఉర్రూతలూగించింది ముమైత్. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఐటం గల్ గా ఇండస్ట్రీని ఏలింది ఈ అమ్మడు. అయితే ఇండస్ట్రీలో ఎవరైనా లవ్ పడడం, బ్రేక్ అప్ అవడం, లేదా పెల్లి చేసుకోవడం, విడిపోవడం వంటివి కూడా కామన్ గా జరుగుతుంటాయి. ఇదే విధంగా ముమైత్ జీవితంలో కూడా ఒక చేదు అనుభవం ఉంది. అదేంటో తెలుసుకుందాం..
అమ్మడు తన జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని, ఒకరిని నమ్మి బాగా మోసపోయానని రీసెంట్ గా ఓపెన్ అయింది. అతను ఎవరో కాదు అలీ సోదరుడు కయ్యుం అని చెప్పుకొచ్చింది. అయితే ముమైత్ ఖాన్ కి ఒక ఫంక్షన్ లో అలీ తమ్ముడు కయ్యుం కలిశారట. దాంతో వీళ్లిద్దరి మధ్య మంచి అభిప్రాయం ఏర్పడటంతో చాలా రోజుల వరకు రిలేషన్ లో ఉన్నారట. ఆ తర్వాత ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. మరో వైపు ఇద్దరు ముస్లిం అవడంతో పెళ్లికి అందరూ ఒప్పుకున్నారట. కానీ కయ్యుం తల్లి ఒప్పుకోలేదని టాక్.
ముమైత్ ఖాన్ ఐటం సాంగ్స్ చేయడం, అందులో ఐటం గల్ గా ఫేమస్ రావడం ఇండస్ట్రీలో అందరికి తెలియడంతో అలాంటి అమ్మాయి వద్దని కయ్యుం తల్లి అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందని టాక్. తల్లి ఒప్పుకోకపోపవడంతో కయ్యుం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ముమైత్ ఖాన్ ఒంటరిగానే ఉంటుంది. ఒకసారి నమ్మి పోసపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదట. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కయ్యుంను తలుచుకొని ఉందట కానీ అసలు పెళ్లే చేసుకోలేదు అని టాక్. ఇందులో నిజం ఎంత అనేది ఆమె స్పందిస్తేగానీ చెప్పలేం. వీరి రిలేషన్ నిజం అయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం వేరే అయి ఉండవచ్చు అంటున్నారు కొందరు. మరి చూడాలి ఈ విషయంపై అమ్మడు స్పందిస్తుందేమో అని…
బిగ్ బాస్ సీజన్ 1లోనే ఎంట్రీ ఇచ్చింది ముమైత్ ఖాన్. మొదటి సీజన్ ఎంత రసవత్తరంగా సాగిందో తెలిసిందే. ఇందులో మంచి ఓట్ల పడ్డా కూడా ఆమె గొడవలకు, అలవాట్లకు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేకపోయింది. కొన్ని వారాలలోనే బయటకు వచ్చేసింది ఈ అమ్మడు. ఒకప్పుడు అందరూ స్టార్ హీరోలతో సాంగ్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ మధ్య డ్రగ్స్ తీసుకుందంటూ ఈమె పేరు బలంగా వినిపించింది. కానీ సరైన ఆధారాలు లేక ఈ కేసును కొట్టివేశారు. ఏది ఏమైనా ముమైత్ ఖాన్ మాత్రం ఎంతో మంది మాస్ అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు కూడా ఆమె డాన్స్ చేస్తే చూడాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు.