Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది. ఎవరేమనుకున్నా నచ్చినట్లు బ్రతికేస్తాను అంటుంది. అనసూయను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. తన హేటర్స్ కుళ్ళుకునేలా అనసూయ పోస్ట్స్ ఉంటాయి. జబర్దస్త్ యాంకర్ గా ఉన్నప్పుడు అనసూయ డ్రెస్సింగ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. బుల్లితెర పై ఆ స్థాయిలో స్కిన్ షో చేయడం సరికాదని ఆమె మీద అసహనం వ్యక్తం చేశారు. సదరు విమర్శలను అనసూయ తిప్పికొట్టింది.
తన డ్రెస్సింగ్ పై ఎవరైనా విమర్శలు చేస్తే… నా బట్టలు నా ఇష్టం. నాకు కంఫర్ట్ గా అనిపిస్తే ఎలాంటి బట్టలైనా ధరిస్తాను. అయినా నేను ఎలాంటి బట్టలు ధరించాలో నిర్ణయించేందుకు మీరెవరు? అంటుంది. అనసూయ యాటిట్యూడ్ చూపిస్తుందని కొందరు అంటారు. ఎవరేమనుకున్నా నేను నాలానే ఉంటాను అంటుంది. కొన్ని విషయాల్లో స్టార్ హీరోలు, ఇండస్ట్రీ పెద్దలను కూడా ఢీ కొట్టే సాహసం చేసింది.
ఒడిదుడుకులు, అవాంతరాలు, విమర్శలు ఎదుర్కుంటూ అనసూయ సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతుంది. యాంకరింగ్ మానేసిన అనసూయ నటిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే తన సక్సెస్ సీక్రెట్ అనసూయ తాజాగా రివీల్ చేసింది. తన మనుగడకు కేవలం కుటుంబమే కారణమని చెప్పుకొచ్చింది. కుటుంబానికి తానిచ్చే తీసుకునే ప్రేమ కారణంగానే తాను మనుగడ సాగిస్తున్నానని ఒక అందమైన వీడియో షేర్ చేసింది. సదరు వీడియోలో తన భర్త శశాంక్, ఇద్దరు పిల్లల గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి.
కుటుంబమే తన సక్సెస్ కి కారణం, తన బలం అని అనసూయ చెప్పకనే చెప్పింది. అనసూయది లవ్ మ్యారేజ్. బీహార్ కి చెందిన సుశాంక్ భరద్వాన్ ని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెద్దలను ఎదిరించి, వాళ్ళు తమ పేమను అంగీకరించే వరకు ఎదురుచూసి పెళ్లి పీటలు ఎక్కింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి అనసూయ సమయం కేటాయిస్తుంది. వీలైనంత ఎక్కువ సమయం వారితో గడిపేందుకు ఇష్టపడుతుంది. తరచుగా విందులు, విహారాలు, వేడుకలు జరుపుకుంటారు.
View this post on Instagram