Ram Charan First Remuneration: ఉద్యోగం పురుషుడి లక్షణం. ఒక వ్యక్తి తాను సొంతంగా పనిచేసి డబ్బులు సంపాదించినప్పుడే జీవితంలో ఎదిగేస్థాయి మొదలైందని చెప్పుకుంటారు. కొందరు చిన్నప్పటి నుంచే ఏదో ఒక పనిచేసి డబ్బులు సంపాదిస్తుంటే.. మరికొందరు చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తారు. ఇలాంటి సమయంలో తాను అనుకున్న ఉద్యోగం వచ్చిన తరువాత ఫస్ట్ వచ్చే సాలరీ ఎంతో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో జీవితంలో గుర్తుండిపోయేలా ఏదైనా మంచి వస్తువును కొనుక్కుంటారు. సాధారణ వ్యక్తులు స్నేహితులకు, బంధువులకు మంచి పార్టీ ఇస్తారు. కానీ సెలబ్రెటీల విషయానికొచ్చేసరికి మంచి గిఫ్ట్ కొనుక్కుంటారు. మెగా హీరో రామ్ చరణ్ కూడా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ తో అదిరిపోయే వస్తువు కొనుక్కున్నాడట.. అదేంటో చూద్దామా.
మెగా కాంపౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అండ ఉన్నా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు సినిమాల్లో శిక్షణ తీసుకున్న ఆయన ఫస్ట్ మూవీతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2007లో వచ్చిన చిరుత లో మెగా హీరో రామ్ చరన్ మొదటిసారి వెండితెరపై కనిపించాడు. ఆయన మొదటి సినిమాలోనే ఏమాత్రం బెరుకు లేకుండా అవలీలగా నటించాడు. ఇందులో రామ్ చరణ్ తో పాటు నేహ శర్మ నటించారు. ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్థి లాంటి వారు ఈ సినిమాలో నటించి సక్సెస్ ను తెచ్చారు.
2007లో ఈ మూవీ ఓవరాల్ గా ఫస్ట్ రోజే రూ.3.81 కోట్ల వసూళ్లు చేపట్టింది. దీంతో మెగా 38 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకొని 22 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఫస్ట్ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో రామ్ చరణ్ మానియా పెరిగిపోయింది. దీంతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ తరువాత బ్లాక్ బస్టర్ మూవీస్ ల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ లెవ్లలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇక రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుతకు రూ.50 లక్షల రెమ్యూనరేషన్ దక్కించుకున్నాడు. ఈ రెమ్యూనరేషన్ తో జీవితంలో గుర్తిండిపోయే విధంగ అదిరిపోయే వస్తువు కొనుక్కున్నాడు. అదేంటంటే తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే చేతి వాచ్. మిలటరీ కలర్ లో ఉన్న ఈ వాచ్ కాసియో బ్రాండ్ కు చెందినది. ఇది తన జీవితంలోనే బెస్ట్ వాచ్ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. దీని తరువాత పటెక్ వాచ్ అంటే చాలా
ఇష్టమని చెప్పాడు. ప్రస్తుతం రామ్ చరణ్ దగ్గర రకరకాల వాచ్ లు ఉన్నాయి.