Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు నందమూరి, మెగా, అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీలు మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్యామిలీ లో నుంచి చాలామంది హీరోలు ఉండడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని నిలబెట్టడంలో వీళ్లు చాలా వరకు కృషి చేశారు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వీళ్ళ తర్వాత చిరంజీవి ఎనలేని సేవలను అందించి సినిమా ఇండస్ట్రీని ముందుకు నడిపించారు.
ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి వచ్చి తనదైన సేవలను అందిస్తూ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనని తాను పవర్ స్టార్ గా మార్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన జనసేన అనే పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసి ఫైట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే వచ్చే నెల లో జరిగే ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు చేస్తూనే, అటు పాలిటిక్స్ లో కూడా బిజీ కానున్న విషయం మనకు తెలిసిందే. ఇక గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆయనకి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది.
ఇక ఈ క్రమం లో ఆయన సినిమాల సంఖ్యని కొద్దివరకు తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తను అసెంబ్లీలో అడుగుపెట్టి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వాటి మీద మాట్లాడాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా ఇప్పటి వరకు ఆయన కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి వీలైతే మొత్తానికే సినిమాలను పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకునే డిసిజన్స్ ఏంటి అనేవి తెలియాలంటే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత గాని తెలిసేలా లేవు. ఇక ఇప్పుడు జనసేన, టిడిపి, బీజేపీ మూడు పార్టీ లు కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఇవి గవర్నమెంట్ ను ఫామ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటి అనేది స్పష్టంగా తెలియాలంటే మరో 2 నెలల వరకు వెయిట్ చేయాల్సిందే…