Mahesh Babu On Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో చాలామంది బ్యాగ్రౌండ్ తో పైకొచ్చి హీరోలుగా రాణిస్తూ ఉంటారు.ఇపుడున్న స్టార్ హీరోలు అందరూ బ్యాగ్రౌండ్ సపోర్ట్ తో వచ్చి ఎదిగిన వాళ్లే, కానీ ఒకప్పుడు చిరంజీవి మాత్రం సోలోగా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగాడు. ఆయన తర్వాత ఇండస్ట్రీలో సోలోగా వచ్చి సక్సెస్ అయిన హీరో రవితేజ. ఇండస్ట్రీలో వరుసగా హిట్ సినిమాలు తీసి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రవితేజ, ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక ఫిబ్రవరి 9వ తేదీన ఈగల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒక విషయం లో రవితేజ కి మహేష్ బాబు ఇంకా హెల్ప్ చేశారన్న విషయం చాలా మందికి తెలియదు. అదేంటి అంటే పోకిరి సినిమాతో పూరి జగన్నాధ్ మహేష్ బాబుకి ఒక అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇక తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు అందరూ విపరీతంగా ఎదురుచూశారు.
ఇక ఆ సమయంలోనే నేనింతే స్టోరీని పూరి మహేష్ బాబుతో చేయాలని ఆయనకి ఆ కథ చెప్పాడు. కానీ మహేష్ బాబు ఈ కథ విని ఇది నాకంటే రవితేజ కి బాగా సెట్ అవుతుందని చెప్పడంతో పూరి కూడా రవితేజ వద్దకి వెళ్ళాడు. అయితే మొదట పూరి రవితేజ తోనే ఈ సినిమా చేయాలి అని అనుకున్నప్పటికీ దీనికి మహేష్ బాబు లాంటి ఒక స్టార్ ఆడ్ అయితే సినిమా రేంజ్ మారుతుంది అనుకున్నాడు. అప్పుడు రవితేజ కూడా స్టార్ హీరోనే అయినప్పటికీ ఆయనతో పోల్చితే మాత్రం మహేష్ బాబు పీక్స్ లో ఉన్నాడు. కాబట్టి పూరి కూడా మహేష్ బాబు తోనే చేయాలని అనుకున్నాడు.
కానీ కథ విన్న తర్వాత మహేష్ బాబు కూడా రవితేజ కి సెట్ అవుతుంది అని చెప్పడంతో పూరి ఇంకొక ఆప్షన్ లేకుండా రవితేజ దగ్గరికి వెళ్లి ఆయనతోనే ఈ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసినందుకుగాను రవితేజ కి మంచి గుర్తింపు వచ్చింది.అలాగే చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇక ఈ మూవీ ఆవరేజ్ గా ఆడినప్పటికీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇది ఒక క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది…ఇక రవితేజ నేనింతే మూవీ చేయడంలో మహేష్ బాబు కూడా చాలా వరకు హెల్ప్ చేశాడు…