Magha Masam: ప్రతి ఆలయంలో కోనేరు ఉంటుంది. ఇందులో పుణ్యస్నానం చేసిన తరువాత దేవుడిని దర్శనం చేసుకుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని కొన్ని కోనేరులు ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడున్న కోనేరులో దేవతలు వచ్చి స్నానం చేస్తారట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించిన బైరవేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఉంటుందీ కోనేరు. కొండల మధ్య ఉన్న ఈ కోనేరు ఎక్కుడంది? ఆ కోనేరు విశేషాలేంటో తెలుసుకుందాం..
శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఎన్నో ఆలయాలు నిర్మాణం చేసుకున్నాయి. ఇదే సమయంలో బైరవేశ్వరస్వామి ఆలయం నిర్మాణం జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లి మండలంలోని తీర్థం, కోట్రేపల్లి గ్రామాల మధ్య బైరవేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో బైరవేశ్వరస్వామి లింగం రూపంలో దర్శనమిస్తుంటారు. దీనిని వ్యాసరాయులు ప్రతిష్టించినట్లు చెబుతున్నారు. ఆలయభైరవేశ్వర స్వామి ఆలయంలో కొండపై ఉంటుంది. ఆలయం వద్ద ఓ కోనేరు ను కూడా ఆ కాలంలో నిర్మించారు.
కొండ ఆవరణలో ఉన్న ఈ కోనేరులో ఉష కాలంలో దేవతలు స్నానం చేసేవారట. అష్ట మంగళం వేసినప్పుడు ఆలయ రహస్యాలు బయటపడ్డాయి. ఇప్పటికీ ఆలయంలోని కోనేరులో దేవతలు వచ్చి స్నానం చేస్తారని కొందరు చెబుతున్నారు. 64 కళలను పోషించే కళాక్షేత్రం ఇక్కడ కలదు. శివరాత్రి సందర్భగా ఇక్కడ ఉత్సవాలు వైభవంగా సాగుతాయి. ఇక్కడ వివాహాలు కూడా చాలానే జరుగుతూ ఉంటాయి.
ఈ ఆలయంలో మొత్తం మూడు కోనేరులు ఉంటాయి. అందులో దేవతా కోనేరు ప్రాముఖ్యత చెందింది. దీనినే దేవతా కోనేరు అని అంటారు. కర్టాటక సమీపంలో ఈ ఆలయం ఉన్నందువల్ల కన్నడ ప్రజలు దోనె బట్టా అని పిలుస్తారు. మాఘమాసంలో ఈ కోనేరులో స్నానం చేస్తే ఎంతో మంచిదని అంటున్నారు. ఈ కోనేరు గురించి తెలిసిన వారు మాఘమాసంలో తరలివస్తున్నారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు చేయనున్నారు.