Bigg Boss OTT Akhil Sarthak: : డిస్నీ హాట్ స్టార్ లో అట్టహాసంగా ప్రారంభైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. ముందు నుండి వివాదాలు, లవ్ స్టోరీలతో సాగే బిగ్ బాస్ ఇప్పుడు 24X7 లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగా.. కంటెంస్టెంట్ల గురించి ఒకరికొరకు గుసగుసలాడటం మామూలే. ఇదే తరహాలో ముమైత్ ఖాన్ గురించి బిగ్ బాస్ హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించే అఖిల్ సార్థక్ మరియు కొత్తగా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన స్రవంతిలు చాటుగా మాట్లాడుకోవడం కనిపించింది.

అఖిల్, స్రవంతి, ముమైత్ ఖాన్ మరియు అజయ్ లు మాట్లాడుతుండగా.. అఖిల్ ను స్రవంతి పక్కకు పిలిచి ‘నీతో ఒక విషయం మాట్లాడాలి’ అని అంటుుంది. దీంతో స్రవంతితో కలిసి అలా నడుచుకుంటూ వచ్చిన అఖిల్ కి.. ‘ముమైత్ ఖాన్ అతడిని ఇష్టపడుతోంది’ అని చెబుతుంది. దానికి అఖిల్ కూడా ‘నాకు తెలుసు. నేను చూస్తున్నా’ అని చెబుతాడు. ముమైత్ ఖాన్ అజయ్ ని ఇష్టపడుతోందని, మంచి ఫ్రెండ్ అని కూడా తను గతంలో చెప్పిందని అఖిల్ చెప్పాడు. అందులో తప్పేముంది అని అఖిల్ అనడం కనిపించింది. మొత్తానికి బిగ్ బాస్ మొదలై వారం కూడా కాలేదు కానీ అప్పుడే లవ్ స్టోరీలు, కంటెస్టెంట్ల మధ్య గాసిప్స్ మొదలు కావడంతో ముందు ముందు మరింత స్పైసీగా షో సాగుతుందని బిగ్ బాస్ లవర్స్ అంటున్నారు.
Also Read: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: ఈ వారంలో అన్ని కోట్లా?
మరి ముమైత్ ఖాన్ లవ్ స్టోరీ నిజంగా నడుపుతోందా? ముమైత్ ను అఖిల్, స్రవంతిలు తప్పుగా అర్థం చేసుకున్నారా? అనే విషయాలు తెలియాలంటే బిగ్ బాస్ షో మరికొన్ని ఎపిసోడ్ల తర్వాత అర్థమవుతుంది.

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఉన్న కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. 10 మంది బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్, మరో 7 మంది కొత్త సెలబ్రిటీలతో టీమ్‌ను సెట్ చేశారు. ఈ షోలో అరియానా గ్లోరి , సరయు, అశురెడ్డి, తేజస్వి మదివాడ, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, బిందు మాధవి, హమీదా ఖాతూన్, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, మిత్రా శర్మ, యాంకర్ శివ, ఆర్జే చైతూ, స్రవంతి చొక్కారపు, అజయ్ కుమార్ కథ్వురార్, అనిల్ రాథోడ్ లు ఉన్నారు.
Also Read: బన్నీ, పవన్, ఎన్టీఆర్ రికార్డులను బద్దలు కొట్టిన ప్రభాస్ !
[…] […]
[…] Bigg Boss OTT Telugu: తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బిగ్ బాస్.. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించింది. శనివారం బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అట్టహాసంగా దీనిని ప్రారంభించగా.. మొదటి వారం ఇంటి కెప్టెన్సీ కోసం వేట మొదలైంది. బిగ్ బాస్ ఓటీటీ తొలి కెప్టెన్సీ కోసం రంగంలోకి ఆరుగురు కంటెస్టెంట్లు దిగుతున్నారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్ లో ఉండగా.. అందులో పది మంది బిగ్ బాస్ షోలలో గతంలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మిగిలిన వారు మాత్రం కొత్తవారు. […]
[…] Aadavallu Meeku Johaarlu: తెలుగు సినిమాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన హీరో శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శుక్రవారం ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమైంది. మంచి నటనతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను ఎంతో అద్భుతంగా చేస్తాడనే పేరున్న శర్వానంద్ మరోసారి.. తన మాయతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయాడు. […]