Raja: టాలీవుడ్ లోని ప్రముఖ పాటల రచయితలలో ఒకరిగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సిరివెన్నెల దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా రాజా, యోగేష్ ఇద్దరూ ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్నారు. ఇద్దరు కొడుకులలో యోగేష్ సంగీతం వైపు దృష్టి పెడితే రాజా మాత్రం నటన వైపు దృష్టి పెట్టారు. యోగేష్ కుదిరితే కప్పు కాఫీ, రంగు, పలు సినిమాలకు సంగీతం అందించారు.
చిన్నబ్బాయి రాజా మాత్రం ఇండస్ట్రీలో నటుడిగా వరుసగా ఆఫర్లను సంపాదించుకుంటూ సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి కేక సినిమాతో రాజా హీరోగా పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలైందనే విషయం కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు. ఆ తర్వాత రాజా నాకు నచ్చని పదం ప్రేమ అనే మూవీలో కూడా నటించారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
Also Read: “పదాలనే కిరణాలు తీసుకుని.. అక్షరాలనే తూటాలతో వేటకు వెళ్తాడు”
హీరోగా చేసిన రెండు ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడానికి కూడా రాజా ఓకే చెప్పారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ద్వారా రాజాకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ కు అన్న పాత్రలో నటించి రాజా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.
పలు సిరీస్ లలో నటించిన రాజా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో పాటు మిస్టర్ మజ్ను, రణరంగం, అంతరిక్షం, మరికొన్ని సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమా ఆఫర్లతో రాజా బిజీగా ఉన్నారు. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీలో రిలీజైన మస్తీస్ సిరీస్ లో తన నటనతో రాజా నటించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్త ఎంతోమంది సాహితీప్రియులను బాధ పెట్టింది.
Also Read: సంప్రదాయ పద్దతిలో ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు… ఇక సెలవు