Anasuya Bharadwaj Assets: బుల్లితెర వ్యాఖ్యాతల్లో అనసూయ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. రంగమ్మత్తగా సినిమాల్లో పాపులారిటీ సంపాదించుకుంది. అటు జబర్దస్త్ లో యాంకర్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం కుర్రకారు గుండెల్ని పిండెస్తోంది. తన అందంతో అందరిని మంత్రముగ్గుల్ని చేస్తోంది. అప్పుడప్పుడు ఈవెంట్లు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఆడి కారు కొనుక్కుని తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. జబర్దస్త్ షోను తన మాటలతో ముందుకు నడిపిస్తోంది. మరోపక్క సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తనకెదురు లేదని నిరూపిస్తోంది. యాంకర్లలోనే బెస్ట్ యాంకర్ గా బిజీగా మారిపోతోంది.

సినిమాల్లో కూడా తన గ్లామర్ ను పండిస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. చిత్ర విజయంలో ఆమె పాత్ర కూడా ఉందనే నమ్ముతారు. తరువాత పుష్ప సినిమాలో కూడా సునీల్ భార్యగా నటించి మెప్పించింది. చిరంజీవి గాడ్ ఫాదర్ లో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా భోళా శంకర్ సినిమాలో కూడా మంచి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇలా రంగమ్మత్త తన అందచందాలతో ఆకట్టుకుని బుల్లితెర, వెండితెరలను ఉర్రూతలూగిస్తోంది.
Also Read: Hema: దాని కోసం ప్రభాస్ కోటి రూపాయలు ఇస్తానన్నాడు.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు
అనసూయ సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఏడాదికి రూ. 2 నుంచి రూ. 3 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అటు టీవీ ఇటు సినిమాల ద్వారా తన ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉంటోంది. గతంలో ఆమె ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు కూడా దాడి చేశారని తెలుస్తోంది. దీంతో తన అందాలను ఎరగా వేసి సంపాదించుకుంటోందని పలువురి వాదన. ఏదో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే అనసూయ తన ఆస్తులను కూడబెట్టుకుంటుందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఏదిఏమైనా ఆమె సంపాదన కొండల్లా పెరుగుతోందని పలువురు చెబుతున్నారు.

అనసూయకు జూబ్లీహిల్స్ లో రూ. 8 కోట్ల విలువైన ఇల్లు ఉంది. రెండు కార్లు ఉన్నాయి. ఆమె ఆస్తి విలువ సుమారు రూ.25 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. జబర్దస్త్ ద్వారానే రూ. 35 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇంకా సినిమా ఈవెంట్లు, పలు షోలకు వెళితే ఆ ఆదాయం అదనంగా వస్తుంది. దీంతో ఆమె తన ఆస్తి విలువ రోజురోజుకు పెంచుకుంటోంది. తన అందాలనే పెట్టుబడిగా పెట్టి జబర్దస్త్ షో ద్వారా అటు సినిమాల్లో నటిస్తూ తనకు తానే సాటిగా నిరూపించుకుంటున్నారు. మొత్తానికి అనసూయ సంపాదన చూసి అందరు ఫిదా అవుతున్నారు. అనతికాలంలోనే అంత పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించుకోవడం మామూలు విసయం కాదని తెలుస్తోంది. కానీ ఆమె తన ప్రతిభతోనే అవకాశాలు దక్కించుకుని అటు బుల్లితెర ఇటు వెండితర రంగాల్లో దూసుకుపోతోంది.
Also Read:Pranitha Baby Bump: ప్రణీత షాకింగ్ ఫొటోలు.. ఇలా చూపిస్తుందని అస్సలు ఊహించలేదు
Recommended Videos: