Anasuya Bharadwaj Assets: ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లు ఒక్క షో అనసూయ ఫేట్ మార్చేసింది. కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్ తెచ్చిపెట్టింది. ఎంబీఏ చదివిన అనసూయ హెచ్ఆర్ గా ఒక కార్పొరేట్ కంపెనీలో కెరీర్ మొదలు పెట్టింది. ఆమె అక్కడే ఆగిపోతే అనసూయ అనే ఒక యాంకర్, యాక్టర్ దొరికేది కాదు. అరాకొరా సంపాదనతో ఎలాంటి గుర్తింపు లేకుండా అందరి మాదిరి లైఫ్ ముగించాల్సి వచ్చేది. క్రియేటివ్ ఫీల్డ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న అనసూయ న్యూస్ రిపోర్టర్ గా మారారు. 2013లో జబర్దస్త్ కామెడీ షోకి ఆడిషన్స్ జరిగాయి. కొత్తగా మొదలవుతున్న జబర్దస్త్ షో యాంకర్ గా అనసూయ సెలెక్ట్ అయ్యారు.

జబర్దస్త్ డబుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది. అనసూయ జీవితం మారిపోయింది. అనసూయకు అంత ఫేమ్ రావడానికి మరొక కారణం కొన్ని సాంప్రదాయాలు బ్రేక్ చేశారు. యాంకర్ అంటే నిండైన బుట్టలో పద్దతిగా ఉండాలనే పాత పద్దతికి చరమ గీతం పాడింది. పొట్టిబట్టల్లో స్కిన్ షో చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేని గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆ దెబ్బతో అనసూయ ఫ్యాన్ బేస్ పాపం పెరిగినట్లు పెరిగింది.
అనతి కాలంలో ఎదిగిన అనసూయ యాంకర్ నుండి యాక్టర్ గా టర్న్ అయ్యారు. ఏకంగా ప్రధాన పాత్రల్లో సినిమాలు చేసే రేంజ్ కి వెళ్లారు. నటిగా బిజీ కావడంతో యాంకరింగ్ పక్కన పెట్టేసింది. ఆమెనే నమ్ముకున్న బుల్లితెర ప్రేక్షకులను నట్టేట ముంచింది. అనసూయ నిర్ణయానికి రెమ్యూనరేషన్ కూడా ఒక కారణం. బెటర్మెంట్ కోరుకున్న అనసూయ యాంకరింగ్ కాదని సినిమాలు చేస్తున్నారు.

అనసూయ ఫార్మ్ లోకి వచ్చి 9 ఏళ్ళు. ఈ తొమ్మిదేళ్లలో అనసూయ సంపాదించింది తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. రోజుకు లక్షల్లో ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్న అనసూయ ప్రస్తుత ఆస్తుల విలువ రూ. 25 కోట్లకు పైమాటే అంటున్నారు. ఆమెకు జూబ్లీహిల్స్ లో రూ. 8 కోట్లు విలువ చేసే ఒక ఇల్లు ఉంది. రూ. 2.5 కోట్లు విలువ చేసే రెండు కార్లు ఉన్నాయి. ఇక చరాస్తులు లెక్క కట్టాల్సి ఉంది. అలాగే ఒక్కరోజు షూట్ కి అనసూయ రూ. 2-3 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో అనసూయ అర్థ రూపాయి మిగల్చడానికి నెక్స్ట్ స్టాప్ వరకు నడిచి వెళ్లి బస్సు ఎక్కేదట. ఇక అర్థం చేసుకోవచ్చు… అనసూయ ఎక్కడ నుండి ఎక్కడకు ఎదిగారో.