Prabhas Bahubali: బాహుబలి మూవీలో ప్రభాష్ యుద్ధంలో కొన్ని యంత్రాలను వాడుతాడు మీకు గుర్తుందా.. అదేనండి పెద్ద బండరాళ్లను విసిరే యంత్రాలు. ఆ బండరాళ్లకు పెద్ద వస్త్రాలను కట్టి వాటిని శత్రువుల మీదకు విసిరి, కాల్చి చంపేస్తాడు.. ఇప్పుడు గుర్తొచ్చిందా. హా దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఇండియాలోకి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది రాక ముందు మన దేశంలో కేవలం కత్తులు, కటార్లతోనే రాజులు యుద్ధాలు సాగిస్తున్నారు.

అయితే ఈ యంత్రం అప్పటికే పాశ్చాత్య దేశాల్లో వాడుకలో ఉంది. మొదటి సారి ఈ యంత్రాన్ని మన దేశంలోకి మగధ రాజు అజాతశత్రు మన దేశంలోకి తీసుకు వచ్చాడు. దీని సాయంతోనే ఆయన లిచ్చావీ రాజ్యంపై దండెత్తి, చాలా సునాయాసంగా అక్కడి సేనలను ఓడించాడు. చివరకు రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. దీన్ని పంగల కర్ర అంటే మన దగ్గర వాడే ఉండేలు కాన్సెప్ట్ తో తయారు చేస్తారు.
Also Read: ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ పై నిర్మాత క్లారిటీ
దీన్ని మొదట్లో తాడును ఆ తర్వాత ఎలాస్టిక్ ను దాని తర్వాత స్ప్రింగ్స్ ను వాడి యుద్ధంలో ఉపయోగించేవారు. వీటితో చాలా పెద్ద బండరాళ్లను శత్రు సైనికుల మీదకు విసిరి వినాశనం సృష్టించేవారు. వీటి దెబ్బకు శత్రువులు చెల్లాచెదురు అయ్యేవారు. అయితే వీటి స్థానంలో రాను రాను పేలుడు పదార్థాలను వాడేవారు. ఆ తర్వాత వచ్చిన ఫిరంగులతో వీటిని పక్కన పడేశారు.

అయితే ఒకప్పుడు యుద్ధాల కోసం వినియోగించిన ఈ పరికరాన్ని ఆ తర్వాత వినోదం కోసం రాజులు ఉపయోగించేవారంట. వీటిపై మనుషులను ఉంచి దూరంగా ఉన్న వలల మీదకు విసిరేసేవారు. అంతే కాకుండా నదులు, సముద్రాల మీదకు కూడా మనుషులను వీటి మీద నుంచి విసిరేసి వినోదం పొందేవారు. కానీ కొన్ని సార్లు దూరాన్ని అంచనా వేయలేక ప్రాణాలు కూడా పోయేవంట. ఇలా ఒకప్పుడు యుద్ధంలో ఉపయోగించిన వాటిని రాజమౌళి ఈ తరానికి బాహుబలి సినిమాతో పరిచయం చేశాడు.
Also Read: ఈ వీక్ సినిమాల పరిస్థితేంటి ?