EVV Satyanarayana: తెలుగులో గిలిగింతలు పెట్టేలా కామెడీ సినిమాలు తీసిన దర్శకుల్లో ఈవీవీ(ఈదరగొండ వీర వెంకట సత్యనారాయణ) ముందుంటారు. అలాగే భార్య భర్తల సంబంధాల నేపథ్యంలో వచ్చిన సినిమాలపై ఈవీవీ ముద్ర ఉంటుంది. ఆయన మనమధ్య లేకున్నా ఆయన చేసిన సినిమాలు నేటితరం వారూ ఇష్టపడుతూ చూస్తుంటారు. డైరెక్టర్ కాకముందు ఈవీవీ సినీ ఫీల్డులో ఎదగడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందట. అయితే ఆయనకు సినిమాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మాత్రం ‘జంబ లకిడి పంబ’. ఈ సినిమా 1992లో వచ్చి ఓ సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాకు డివివి దానయ్య, ఆచంట గోపినాథ్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాను రూ.50 లక్షలతో నిర్మించగా రూ.2 కోట్లు వసూలు చేసి రికార్డు బద్దలు కొట్టింది.

‘జంబలకిడి పండ’ కథ రాసుకున్న ఈవీవీ దానిని ఆంధ్రజ్యోతి పత్రికలో అచ్చు వేయించడానికి కార్యాలయానికి వెళ్లారు. కానీ దీనిని కూడా పత్రికలో వేస్తారా..? అంటూ తిప్పి పంపారట. దీంతో తాను ఓ పోజిషన్లోకి వచ్చాక ఈ కథతో సినిమా తీయాలని అనుకున్నారట. ఇలా కొంతకాలం తరువాత సినీ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన ఈవీవీ ‘జంబలకిడి పంబ’ సినిమాను తీశారు. ముందుగా ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ హీరోగా అనుకున్నారు. కానీ ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ కుదరకపోవడంతో నరేశ్ ను అనుకున్నారు. దీంతో నరేశ్ హీరోగా చేయాల్సి వచ్చింది.
ఇక హీరోయిన్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కానీ చివరికి ఆమనికి అవకాశం ఇచ్చారు. అప్పటి వరకు అమనిక సరైన ఆఫర్లు లేవు. కానీ ఈ సినిమా తరువాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, బాబు మోహన్ ఇలా ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్లంతా ఈ సినిమాలో కనిపించడం విశేషం. మొత్తం కమెడియన్లంతా కలిసి ఈ సినిమాలో చేసిన సందడి మాములుగా ఉండదు. మొగవాళ్లు ఆడవాళ్లుగానూ.. ఆడవాళ్లు మొగవాళ్లుగానూ మారి సినిమా వినోదాన్ని పంచుతుంది. అలా నెలరోజుల్లోనూ షూటింగ్ రూపుదిద్దుకున్న ఈ సినిమాను 1992 జూలై 12న రిలీజ్ చేశారు.

కేవలం రూ.50 లక్షల పెట్టుబడి పెట్టి ‘జంబలకిడిపంబ’ను తీశారు. అయితే ముందుగా కాస్త వెనుకడుగు వేసినా ఇవీవీపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ ఊహించని రేంజ్ లో సినిమా సక్సెస్ సాధించింది. ఆ కాలంలో ఏకంగా రూ.2 కోట్ల షేర్ చేసి రికార్డు బద్దలు కొట్టింది. అలా వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శత దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ పెట్టుబడిలో అద్భుతమైన కామెడీ అందించిన ఇవీవీని ఇప్పటికీ కొందరు గుర్తు చేసుకుంటూ ఉంటారు.
అయితే ఇప్పుడు వస్తున్న సినిమాల్లోకామెడీ పూర్తిగా కరువైంది. కొత్త కొత్త కమెడియన్లు వస్తున్నా సినిమాల్లో వినోదాన్ని పంచలేకపోతున్నారు. దీంతో ఇవీవీ సినిమాలు ఇప్పటికే టీవీల్లో సందడి చేస్తున్నాయి. ఆయన చివరి రోజుల్లో తీసిన ‘ఎవడిగోల వాడిదే’ సినిమా ఇప్పటికీ బ్లాక్ బస్టర్ మూవీగానే రన్ అవుతుంది. కమెడియన్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఇవీవీ లేకపోవడం వారికి తీరని లోటు మిగిల్చిందని కొందరు అంటుంటారు.
[…] Also Read: ఈవీవీ లైఫ్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ బడ్… […]
[…] Also Read: ఈవీవీ లైఫ్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ బడ్… […]
[…] Also Read: ఈవీవీ లైఫ్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ బడ్… […]