Aishwarya Rai Remuneration: సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్స్ లో ఒకరైన మణిరత్నం గారి డ్రీం ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు మొదటి ఆట నుండి ఆకాశన్ని అంటిన అంచనాలను అందుకోలేక డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి వసూళ్ల పరంగా మాత్రం ఇసుమంత ప్రభావం కూడా చూపలేదు..కేవలం మూడు రోజుల్లోనే 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం, కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అయ్యే దిశగా ముందుకి దూసుకుపోతుంది..ఇది పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది..ఈ చిత్రం లో విక్రమ్, జయం రవి మరియు కార్తీ వంటి అగ్ర హీరోలతో పాటుగా ఐశ్వర్య రాయ్ మరియు త్రిష వంటి వారు కూడా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే.

వీళ్ళు ఈ సినిమాలో నటించేందుకు గాను తీసుకున్న పారితోషికం గురించి సోషల్ మీడియా లో ఒక కథనం తెగ హల్చల్ చేస్తుంది..అదేమిటి అంటే ఈ సినిమాలో నటించేందుకు గాను చియాన్ విక్రమ్ ఏకంగా 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట..ఆయన పాత్ర నిడివి తక్కువే అయ్యినప్పటికీ కూడా ఇంత భారీ మొత్తం రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషం..ఇక ఈ సినిమా ఒక విధంగా నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం కార్తీ..ఆయన నటన వల్లే ప్రేక్షకులు థియేటర్స్ లో మూడు గంటలపాటు కోర్చోగలిగారు..కానీ ఆయనకీ ఈ సినిమా కోసం ఇచ్చిన రెమ్యూనరేషన్ కేవలం 5 కోట్ల రూపాయిలు మాత్రమేనట..అలాగే జయం రవి కి 8 కోట్ల రూపాయిల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో నందిని గా అద్భుతమైన నటనని కనబర్చిన ఐశ్వర్య రాయ్ కి ఏకంగా పది కోట్ల రూపాయిల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం..సౌత్ ఇండియా లోనే ఒక హీరోయిన్ కి ఇంత భారీ మొత్తం పారితోషికం ఇవ్వడం ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు..అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నేడు రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది..భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డ్స్ ని ఈ సినిమా నెలకొల్పుతుందో చూడాలి.