Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తన స్థాయిని చాలా సంవత్సరాల పాటు సుస్థిరం చేసుకుంటూ వస్తున్న ఏకైక హీరో చిరంజీవి. ఇక ఈయనను మించిన నటుడు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈయన పోషించిన పాత్రని ఇప్పుడున్న హీరోలు పోషించడం అంటే చాలా కష్టం… ఇక చిరంజీవి డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 70 సంవత్సరాల వయసులో కూడా గ్రేస్ తగ్గకుండా స్టెప్పులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి…
దర్శక దీరుడుగా పేరుపొందిన రాజమౌళి లాంటి దర్శకుడు సైతం చిరంజీవి గురించి మాట్లాడుతూ డాన్స్ అందరూ చేస్తారు. కానీ చిరంజీవి డాన్స్ చేసినప్పుడు ఆయనలో ఉండే గ్రేస్ ఇంకేవరికీ రాదు అని చెప్పడం విశేషం… ఇక ఇదిలా ఉంటే మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, మమ్ముట్టి లు హీరోలుగా వచ్చిన ‘దళపతి ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమాలో మొదట రజనీకాంత్ క్యారెక్టర్ కోసం చిరంజీవిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ చిరంజీవి ఈ పాత్రను చేయడానికి ఇష్టపడలేదు.
ఎందుకంటే దళపతి సినిమా సమయానికి ఆయన జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్టును కొట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన అప్పటికే ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక దానికి తోడుగా మరొక హీరో తో స్క్రీన్ షేరింగ్ చేసుకోవడం అనేది చిరంజీవికి నచ్చలేదట. ఇక దానికి తోడుగా దళపతి లో రజనీకాంత్ ఒక అనాధ.. ఆ క్యారెక్టర్ ఒక అమ్మాయిని లవ్ చేసిన ఆమెను పెళ్లి చేసుకోలేడు.
ఇక వేరే ఎవరినో పెళ్లి చేసుకొని పిల్లాడు పుట్టిన ఒక ఆవిడని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక దానివల్ల తన ఇమేజ్ కు ఆ క్యారెక్టర్ సరిపోదని తన అభిమానులు తనని అలా చూడలేరనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఆ పాత్రను రిజెక్ట్ చేసినట్టుగా ఒకనొక సందర్భంలో తెలియజేశాడు…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తు మంచి దూకుడు మీద ఉన్నాడు…