Samantha-watch-price
Samantha: స్టార్ హీరోయిన్ సమంత చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో నటించిన ‘ సిటాడెల్ ‘ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ యాక్షన్ వెబ్ సిరీస్ కి హనీ బన్నీ అనే టైటిల్ నిర్ణయించారు. సినిమాల నుండి షార్ట్ గ్యాప్ తీసుకున్నా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ కి టచ్ లో ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఈ క్రమంలో తన లేటెస్ట్ ఫోటో షూట్ ఒకటి నెటిజెన్స్ ని ఆకర్షించింది.
ఇందులో సమంత చాలా స్టైలిష్ గా కనిపించింది. ప్రముఖ బ్రాండ్ దుస్తులు, వాచ్ ధరించిన సమంత లుక్ మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఆమె చేతికి ఉన్న లగ్జరీ వాచ్ పై అందరి కన్ను పడింది. వజ్రాలు పొదిగిన ఈ వాచ్ ధర తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు. సమంత ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీ కి చెందిన వైట్ లక్కర్ జాకెట్ తో పాటు మినీ స్కర్ట్ ధరించారు. మత్తెకించే కళ్ళతో ఆకట్టుకుంటుంది. తన డ్రెస్ కి తగ్గట్టు ఆమె ధరించిన డైమండ్ స్టడెడ్ సెర్పెంటిస్పీగా వాచ్ తెల్లటి దుస్తులకు సరిగ్గా సరిపోయింది.
ఈ వాచ్ డయల్ చుట్టూ సిల్వర్ ఒపలైన్, డైమండ్లతో పొదగబడింది. వాచ్ ధర తెలిసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ బల్గారియా సర్పెంటీ వాచ్ ధర రూ. 70 లక్షలు అని సమాచారం. ఈ వాచ్ ని సమంత మరో రెండు సందర్భాల్లో కూడా ధరించారు. గత ఫోటో షూట్లో బ్లాక్ కలర్ డ్రస్ ధరించిన సమంత చేతికి ఈ వాచ్ చూడవచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో సమంత ఈ సర్పెంటీ వాచ్ ధరించి కనిపించారు.
ఇక సమంత కెరీర్ పరిశీలిస్తే.. హనీ బన్నీ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీలో సమంతకు అవకాశం దక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి అల్లు అర్జున్ సైన్ చేశారట. ఈ ప్రాజెక్ట్ లో సమంతకు ఛాన్స్ దక్కిందట. గతంలో సమంత-అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో జతకట్టారు. పుష్ప చిత్రంలో సమంత ఐటెం సాంగ్ చేసింది.
Web Title: Do you know the price of this luxury watch on samanthas hand
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com