Bro Shoe : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వింటేజ్ పవర్ స్టార్ స్టైల్, డైలాగ్ డెలివరీ మరియు కామెడీ టైమింగ్ ని చూసి అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందించారు.
ఫలితంగా ఈ టీజర్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే ఈ టీజర్ 32 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. అతి త్వరలోనే 40 మిలియన్ వ్యూస్ ని కూడా అందుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ అభిమానులకు చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించినది ఏ చిన్న వస్తువు అయినా కొనుక్కోవడానికి ఎగబడే ఫ్యాన్స్ ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ మరియు డ్రెస్ ఎక్కడ దొరుకుంటుందా అని ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు.
ముఖ్యంగా ఆయన జీపు మీద సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్టైల్ గా కూర్చున్న ఫోటో అభిమానులకు తెగ నచ్చేసింది. ఆ జీపు మీద పెట్టి ఉన్న పవన్ కళ్యాణ్ బూట్లు వాళ్ళను ఇంకా ఆకర్షించింది. వెంటనే దాని ఫోటో ని క్రాప్ చేసి గూగులే లో వెతకడానికి ప్రయత్నం చేసారు.అయితే ఈ బూట్ల ధర దాదాపుగా వెయ్యి డాలర్ల వరకు ఉంటుందని అంచనా, వెయ్యి డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 80 వేల రూపాయిలు అన్నమాట.
80 వేల రూపాయిలు అంటే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం బ్రతికేస్తుంది అనే చెప్పాలి.ఇలాంటివి కొనడానికి మనకు అసాధ్యం, కానీ చూసేందుకు ఆ బూట్లు ఎంతో అందం గా ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన మొదటి సాంగ్ ని ఈ నెల మొదటి వారం లోనే విడుదల చెయ్యబోతున్నారు.