Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. అతి చిన్న వయస్సులోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకొని వడివడిగా పాన్ వరల్డ్ వైపు అడుగులు వేస్తున్న ఈ నందమూరి నట వారసుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న నటుల్లో అన్ని రకాల పాత్రలు చేయగలిగిన ఒకే ఒక నటుడు ఎన్టీఆర్ మాత్రమే అని కచ్చితంగా చెప్పవచ్చు.
ఇక ఒకప్పటి హీరో వడ్డే నవీన్ గురించి నేటి తరానికి తెలియకపోవచ్చు కానీ, 90 లో పుట్టిన వాళ్ళ కి బాగానే పరిచయం ఈ పేరు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన నవీన్ ఆ తర్వాత చెప్పుకోదగిన హిట్స్ లేకపోవటంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ కి వడ్డే నవీన్ కు బంధుత్వం ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఈ ప్రేమ పెళ్లి విషయంలో ఎన్టీఆర్ కూడా సహాయం చేశాడనే మాటలు వినిపిస్తున్నా కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. నందమూరి ఫ్యామిలీ కి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో నవీన్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోణంలో చూసుకునే నవీన్, ఎన్టీఆర్ బావ బావమరుదులు అవుతారు. కొన్ని ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.
టాలీవుడ్ లో మిడిల్ ఏజ్ పాత్రలు చేసే నటులకు డిమాండ్ బాగా నడుస్తోంది. అలాంటి వాటికి నవీన్ సరిపోవచ్చు. పైగా ఒకప్పటి తరానికి బాగా పరిచయం ఉన్న పేరు కావటంతో వడ్డే నవీన్ నటిస్తే సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు దర్శకులు నవీన్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన రీఎంట్రీ ఖాయం. ఎలాగూ నందమూరి అల్లుడు కాబట్టి ఆ తరుపు నుండి సపోర్ట్ కూడా ఉంటుంది.