Ponniyin Selvan-2 Child Artist: చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత చాలా మంది హీరోయిన్లు గా మారిపోయారు. అయితే ప్రస్తుతం వారు స్టార్లు కాకపోయినా చిన్న వయసులోనే విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అందుకే కొందరు చిన్నారులకు సినిమాల్లో అవకాశం వస్తే వారి తల్లిదండ్రులు ఏమాత్రం వదులుకోవడం లేదు. మరీ ముఖ్యంగా మణిరత్నం డైరెక్షన్లో నటించే చాన్స్ వస్తే ఎవరైనా విడిచిపెడుతారా? సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్టు డైరెక్టర్ గా పేరున్న ఆయన సినిమాలు ఒకప్పుడు బ్లాక్ బస్టర్. ఇటీవల ఆయన డైరెక్షన్లో తీసిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1,2 లు రిలీజయ్యాయి. అయితే పార్ట్ 1 యావరేజ్ గా సాగింది. సీక్వెన్స్ మూవీ సైతం పెద్దగా ఆకట్టుకోలేదు.
కానీ ఇందులో నటించిన వారికి మాత్రం పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ వచ్చింది. విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిషలు పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో ప్రధానంగా కనిపిస్తారు. ఐశ్వర్య, త్రిషలు చిన్నవయసులో ఉన్న పాత్రలో ఇద్దరు యువతులు నటించారు. మొన్నటి వరకు ఐశ్వర్య చిన్నప్పటి పాత్రలో నటించింది సారా అర్జున్ అని అందరికీ తెలిసిపోయింది. ఈమె ఓ నటుడి కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇప్పుడు త్రిష చిన్నప్పటి పాత్రలో నటించిన అమ్మాయి గురించి చర్చ సాగుతోంది.
జూనియర్ త్రిషగా నటించిన అమ్మాయి అందంతో పాటు ఆకర్షణీయంగా కనిపించింది. త్రిషకు పోటీగా బ్యూటీనెస్ తో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎవరా? అని ఆరా తీస్తున్నారు. ఈ అమ్మాయి పేరు నీల. కేరళ చదువుకుంటున్న ఈ యువతి ఇంకా కళాశాల చదువులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సినిమా ఆడిషన్స్ ఉన్నాయని తెలియగానే అటెండ్ అయింది. వెంటనే ఆమె పొన్నియన్ సెల్వన్ సిరీస్ కు ఎంపికైంది.
అయితే నీల ఎవరో కాదు. తమిళ సీరియల్స్ ను తీసే డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కవితా భారతి కూతురు. తల్లి సినిమా ఇండస్ట్రీలో పనిచేసినందు వల్ల నీల కు కూడా సినీ పరిశ్రమపై ఆసక్తి ఏర్పడింది. ఈ తరుణంలో ఆమెకు డెబ్యూ మూవీనే భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో త్రిష చిన్నప్పటి పాత్రలో అద్భుతంగా నటించింది. అంతేకాకుండా అందంగా కనిపించడంతో ఆమె త్వరలో హీరోయిన్ అవుతుందని చర్చించుకుంటున్నారు.