Tollywood: ప్రస్తుతం ఒక సినిమా రిలీజ్ అయింది అంటే చాలు ఆ సినిమా అంత కలెక్ట్ చేసింది, ఇంత కలెక్ట్ చేసింది ఇన్ని రికార్డులు బ్రేక్ చేసింది అంటూ ఆ సినిమా వాళ్ళు భారీ పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. ఇక వందల కోట్లు, వేల కోట్ల వసూళ్లను సాధించాయి అంటూ చాలా గొప్ప గా చెబుతున్నారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా 10 కోట్ల కలెక్షన్స్ ను సాధించిన సినిమా ఏంటి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ డూపర్ సక్సెస్ లను సాదించిన సినిమాలు వచ్చాయి.
ఇక ముఖ్యంగా చిరంజీవి హీరోగా వచ్చిన ప్రతి సినిమా భారీ రికార్డ్ లను సృష్టించేది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా ఏకంగా మొదటిసారి 10 కోట్లు రాబట్టిన మొదటి సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా వచ్చిన తర్వాత ‘ది వీక్ ‘ అనే ఒక ఆంగ్ల వార పత్రికలో చిరంజీవి గురించి చాలా గొప్పగా రాశారు. ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో చిరంజీవి అని చెబుతూనే, “బిగ్గర్ దెన్ బచ్చన్” అంటూ ఆయన్ని పొగడడం అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది.
ఇక ఈ సినిమాతో చిరంజీవి 5 వ ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చిరంజీవి నటన పరంగా మెగాస్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకోవడానికి తనను తాను ఒక శిల్పి లా చెక్కుకున్నాడనే చెప్పాలి. అంతటి నిబద్ధత కలిగిన నటుడు మరొకరు లేరని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే ఈ సినిమాకి విశేషమైన స్పందన రావడమే కాకుండా అప్పటివరకు చిరంజీవి కెరియర్ లోనే ఇదొక బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడం విశేషం…
1992 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఆ ఇయర్ మొత్తం ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే ఒక సోషియో ఫాంటసీ మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాలో కొత్తగా కనిపించడమే కాకుండా వైవిధ్యమైన నటనను కూడా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది…