Ram Charan: ఒకనొక టైం లో ఇండియా లోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఒకే ఒక దర్శకుడు శంకర్. మధ్యలో ఆయన క్రేజ్ కొంతవరకు తగ్గినప్పటికీ ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ హీరోగా గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో ప్రపంచం మొత్తం తెలియజేయాలని చూస్తున్నాడు.
అందులో భాగంగానే ఈ సినిమాలో ప్రతి సీన్ ని చెక్కుతూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అనే విషయం కూడా చిత్ర యూనిట్ అఫిషియల్ గా వెల్లడించింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాని తొందరలోనే కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ గా వస్తుంది. కాబట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం చిరంజీవిని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
అది ఏంటి అంటే ఈ సినిమాలో సీఎం పాత్ర ఉంది. ఆ పాత్ర సినిమాలో చాలా కీలకమైనది కావడం వల్ల ఆ పాత్ర కోసం చిరంజీవి అయితే బాగా సెట్ అవుతాడు అందుకే ఆ పాత్ర ఆయన చేస్తే బాగుంటుంది అని శంకర్ రామ్ చరణ్ కి చెప్పి ముందు చరణ్ ని ఒప్పించాడు. ఇక ఈ సినిమాలో ఒక నాలుగు రోజుల పాత్ర చిరంజీవి తో చేయించ బోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించిన షూటింగ్ పనుల్లో శంకర్ బిజీ కానున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు ఆచార్య సినిమాలో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా మారినప్పటికీ, ఈ సినిమాలో మాత్రం ఇద్దరు కలిసి నటించి సినిమాని సూపర్ సక్సెస్ చేయాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక రామ్ చరణ్, శంకర్ ఇద్దరు కలిసి చిరంజీవి కి ఆ క్యారెక్టర్ వివరించడంతో చిరంజీవి కూడా ఆ పాత్ర చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే చిరంజీవి తో షూటింగ్ చేయడానికి కాస్త సమయం పడుతున్నప్పటికీ దానికి సంబంధించిన మేకోవర్ లో చిరంజీవి బిజీగా కానున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ లో ఉన్న చిరంజీవి ఆ షూటింగ్ అయిపోయిన వెంటనే ఒక పది రోజులపాటు ఈ సినిమాకి సంబంధించిన మేకవర్లో సెట్ అయి ఒక నాలుగు రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తుంది…ఇక విషయం తెలుసుకున్న మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి…