Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేదు. సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెబుతూ చాలా పాపులర్ అయ్యారు. గతంలో ఈయన చెప్పిన కొన్ని విషయాలు నిజం అవడంతో ఈయన జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. సమంత, నాగచైతన్య విషయంలో ఈయన చెప్పింది నిజం అవడంతో మరింత పాపులర్ అయ్యారు వేణు స్వామి. అప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే కొంతమంది సెలబ్రెటీల విషయంలో ఘాటు ఆరోపణలు చేశారు.
ఈ వివాదాస్పద జ్యోతిష్యుడు ఒక సినిమాలు నటించారు అని మీకు తెలుసా? ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ వేణు స్వామి కూడా ఓ సినిమాలు నటించారు. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఇంతకీ ఏ సినిమాలో నటించారు అనుకుంటున్నారా? జగపతి బాబు హీరోగా నటించిన జగపతి అనే సినిమాలో అర్చక స్వామి పాత్రలో నటించారు వేణు స్వామి. అందులో హీరోయిన్ రక్షిత జగపతి బాబు కాంబోలో వేణు స్వామి కనిపించి అలరించారు. అయితే ఈయనకు కేవలం రెండే డైలాగులు ఉన్నాయి.
అంతే కాదు త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అతడులో కూడా ఈ వేణు స్వామి కనిపించారు. అయితే ఓ సాంగ్ లో కనిపిస్తారు. అయితే మొన్నటి వరకు వేణు స్వామి పై ప్రభాస్ అభిమానులు ఆగ్రహంతో మునిగిపోయారు. ఎందుకంటే ప్రభాస్ జీవితం అయిపోయిందని.. ఆయన సినిమాలు హిట్ కావని.. పెళ్లి కూడా జరగదని కొన్ని కామెంట్లు చేశారు. కానీ సలార్ హిట్ అవడంతో ఈయన కామెంట్లు విని బాధ పడ్డ అభిమానులు మండిపడ్డారు. సలార్ హిట్ తో అందరిలో ఉన్న అపోహలు తొలగిపోయాయి. కానీ ఇంకా కూడా వేణు స్వామిని నమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. మరి చూడాలి ముందు ముందు ఈయన జీవితం ఎలా ఉండబోతుందో…