Uyyala Jampala Child Artist: చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వాళ్లలో కొంతమంది పెరిగి పెద్దయి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ పర్ఫామెన్స్ చూపిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 50 సినిమాల్లో నటించిన ఓ అమ్మాయి ఇప్పుడు యువతి గా మారింది. తన అందచందాలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు సినిమాల్లో చిన్న పిల్లలా ఉన్న ఆమెను ఇప్పుడిలా చూసే సరికి యూత్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఎవరామె? చైల్డ్ ఆర్టిస్టుగా ఏ సినిమాలో అలరించింది?
‘ఉయ్యాల జంపాల’ మూవీ గురించి ఎవరూ మర్చిపోరు. రాజ్ తరుణ్, అవికా గోర్ నటించిన ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా నిలిచింది. లవ్, కామెడీ, ఎమోషనల్ తో కూడా ఈ మూవీ 2013 డిసెంబర్ 25న థియేటర్లోకి వచ్చింది. విరించి వర్మ డైరెక్షన్లో వచ్చిన దీనిని రామ్ మోహన్ పి, నాగార్జున కలిసి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్ పై రిలీజ్ అయిన దీనిని రూ.80 లక్షలతో నిర్మించగా.. బాక్సాపీస్ వద్ద కోటి 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా స్టోరీనే కాకుండా మ్యూజికల్ గా కూడా హిట్టు కొట్టింది.
ఈ సినిమా బేసికల్ గా లవ్ స్టోరీ. కానీ ఇందులో కామెడీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా కొంతమంది కుర్రాళ్లతో కలిసి ఓ అమ్మాయి నటించింది. ఆ అమ్మాయి పేరు ప్రణవి మానుకొండ. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి 11 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ‘రోటీన్ లవ్ స్టోరీ,’ ‘ఉయ్యాల జంపాల’ సినిమాల్లో నటించి తరువాత ఆమెకు అవకాశాలు పెరిగాయి. అలా కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తరువాత బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి.
సీరియళ్లలో తన ప్రతిభ చూపించి అందరికీ చేరువైంది. టీవీ సీరియళ్లు అయిన ‘సూర్యవంశం’, ‘పుసుపు కుంకుమ’, ‘ఎవరే నువ్వు మోహిని’ ‘గంగ మంగ’ సీరియల్స్ లో నటించింది. ఓ వైపు ఇలా సీరియళ్లలో నటిస్తూనే మరోవైపు టిక్ టాక్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేసిన తరువాత రీల్స్ తో అదరగొడుతుంది. ఏ హిట్టు సినిమా పాట వచ్చినా ఆ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.ఈ క్రమంలో ప్రణవి ఇప్పుడు మరింత ఫేమస్ అయింది.
ఆ మధ్య సింగర్ నోయల్ తో కలిసి ‘హస్లర్’అనే వీడియో సాంగ్ లో మెరిసింది. ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు పై చేసిన ఈ వీడియో సక్సెస్ కావడంతో ప్రణవి కి మరింత క్రేజీ పాపులారిటీ వచ్చింది. ఇలా సోషల్ మీడియాలో మెరిసిన అమ్మడు ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ హిట్టు సాధించినా ప్రణవికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా ఆమె నటనకు ఫిదా అయిన చాలా మంది ఆమెకు ఫాలోవర్స్ గా మారుతున్నారు. అయితే ఈ భామ నెక్ట్స్ ఏ మూవీలో అలరిస్తుందో చూడాలని ఆశపడుతున్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram