Pelli Sandadi Movie Heroine: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎన్నో తెలుగు సినిమాలను అందించారు. అలనాటి ఎన్టీఆర్ నుంచి నేటి శ్రీకాంత్ కొడుకు రోషన్ వరకు చాలా మందితో కలిసి పనిచేసిన ఆయన ఇప్పటికీ స్టార్ డైరెక్టర్ అనే పిలుస్తారు. ఈయన తీసిన బ్లాక్ బస్టర్ మూవీల్లో ‘పెళ్లి సందడి’ ఒకటి. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో పెళ్లిళ్లో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక దశలో పెళ్లిళ్లు ఇలాగే జరగుతాయని చాలా మంది అనుకున్నారు. ఆ తరువాత చాలా సినిమాలు పెళ్లి సందడిని బేస్ చేసుకొని వచ్చాయి. కానీ ఇప్పటికీ ఈ సినిమాలోని కథ, జోక్స్, లవ్ ఎమోషన్ ఆకట్టుకుంటాయి. లవ్ ఎమోషన్ తెప్పించే సీన్లో ఓ హీరోయిన్ నటించిన విషయం తెలిసిందే. ఆమె దీప్తి భట్నాకర్. ఈమె ఇప్పుడు ఏం చేస్తుందో? ఎలా ఉందో చూస్తే మతి తిప్పుకోరు.
పెళ్లిసందడిలో రవళి తో పాటు దీప్తి భట్నాకర్ నటించింది. ఈమె 1967 సెప్టెంబర్ 30న ఉత్తరప్రదేశ్ లో ని మీరట్ లో జన్మించారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలో పూర్తి చేసిన ఈమె ఆ తరువాత 1962లో హస్త కళల సంస్థను ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఆ తరువాత ముంబైకి వెళ్లింది. అక్కడ రూపమాలిని అనే చీరల సంస్థకు మోడల్ గా పనిచేసింది. ఇదే సమయంలో 1990లో ఈవ్స్ వీక్లీ పోటీల్లో విజేతగా నిలిచింది.
దీప్తి భట్నాకర్ కు మొదటిసారిగా జాకీ ష్రాప్ ‘రాం శాస్త్ర‘ అనే సినిమాలో మనీషా కోయిరాలతో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత 1990లో వచ్చిన పెళ్లిసందడి సినిమాలో దీప్తి పట్నాకర్ నటించారు. ఇందులో శ్రీకాంత్ కలల రాణిగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీ తరువాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో 2002లో కొండవీటి సింహాసనం అనే సినిమా చేసి తెలుగుకు దూరమైంది.
సినిమాలకు దూరమైన తరువాత దీప్తి భట్నాకర్ ఫ్యామిలీ లైఫ్ కు అంకితమయ్యారు. బాలీవుడ్ డైరెక్టర్ రణదీప్ ఆర్యను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే పెళ్లి తరువాత దీప్తీ భట్నాకర్ తెలుగులో నటించకపోయినా మలయాళంలో అవకాశాలు వచ్చాయి. 2007లో ‘రాకిలి పట్టు’ అనే సినిమాలో నటించిన తరువాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఓ ప్రొడక్షన్ సంస్థను స్టార్ట్ చేసి టీవీ షోలను నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఫొటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.