Raj Nidimoru Net Worth: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నేడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ని పెళ్ళాడి కొత్త జీవితం లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో కాసేపటి క్రితమే సమంత తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను కూడా అప్లోడ్ చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. అయితే రాజ్ నిడిమోరు గురించి సోషల్ మీడియా ని రెగ్యులర్ గా అనుసరించే వాళ్లకు తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఈయన ఒక నిర్మాత, రచయితా మరియు దర్శకుడు కూడా. తిరుపతి ప్రాంతానికి చెందిన ఈయన 2003 వ సంవత్సరం లో ఫ్లావర్స్ అనే ఇంగ్లీష్ చిత్రం ద్వారా కెరీర్ ని ప్రారంభించారు. ఈ సినిమాలో రాజ్ నటించడమే కాకుండా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితా గా కూడా వ్యవహరించాడు. ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది.
ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని 99 అనే హిందీ చిత్రం ద్వారా డైరెక్టర్ గా మన ముందుకొచ్చాడు. ఈ చిత్రం ఒక మోస్తారుగా ఆడింది. అలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన రాజ్ కి సక్సెస్ లు పెద్దగా వరించలేదు. కానీ ఆయన రచయితగా వ్యవహరించిన స్త్రీ అనే బాలీవుడ్ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమాల పరంగా రాజ్ కి పెద్దగా కలిసి రాలేదు కానీ, వెబ్ సిరీస్ లు మాత్రం బాగా కలిసి వచ్చాయి. రాజ్ తో పాటు డీకే (కృష్ణ దసరాకొత్తపల్లి) కూడా అన్నిట్లో భాగం అయ్యేవాడు. వెబ్ సిరీస్ లు కూడా వీళ్లిద్దరు కలిసే దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అలా 2019 వ సంవత్సరంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా అమెజాన్ ప్రైమ్ లో మన ముందుకు వచ్చాడు.
ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది. రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా మూడవ సీజన్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత రాజ్ దర్సకత్వం లో వచ్చిన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే విధంగా గత ఏడాది విడుదలైన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా కేవలం వెబ్ సిరీస్ల ద్వారా రాజ్ నిడిమోరు దాదాపుగా 300 కోట్ల రూపాయిల వరకు సంపాదించాడని టాక్. ప్రస్తుతం ఆయన నెట్ ఫ్లిక్స్ సంస్థ కోసం ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో సమంత కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వచ్చే ఏడాది ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.