Aryan Khan: షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఎంత మందితో డేటింగ్ చేశాడో తెలుసా?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్ కేసుతో సంచలనం అయ్యాడు. డ్రగ్స్ కేసు నుంచి బయటపడిన ఆర్యన్.. పాకిస్థాన్ మోడల్, నటితో డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి.

Written By: Swathi, Updated On : January 24, 2024 5:07 pm
Follow us on

Aryan Khan: సాధారణంగా సోషల్ మీడియాలో నిత్యం ఎవరో ఒక సెలబ్రెటీ కి సంబంధించిన రిలేషన్ షిప్, డేటింగ్, ఎపైర్ లకు సంబంధించిన పుకార్లు షికర్లు చేస్తూనే ఉంటాయి. చిన్న నటుల దగ్గర నుంచి పెద్ద నటుల వరకు ప్రతి ఒక్కరి పై ఇలాంటి గాసిప్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు నిజమైతే ఎక్కువ సందర్భంలో అబద్దంగానే తేలాయి. తాజాగా తమన్నా నటుడు విజయ్ తో, రష్మికా మందనా విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు ఎక్కువగా వచ్చాయి. ఇదే విధంగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఒక నటితో డేటింగ్ లో ఉన్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికే ఆర్యన్ ఖాన్ పై డేటింగ్ రూమర్స్ ఎన్నో వచ్చాయి. అవి ఒకసారి చూద్దాం…

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్ కేసుతో సంచలనం అయ్యాడు. డ్రగ్స్ కేసు నుంచి బయటపడిన ఆర్యన్.. పాకిస్థాన్ మోడల్, నటితో డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. ఆమె ఎవరో కాదు సాదియా ఖాన్. వీరిద్దరు క్లోజ్ ఉన్న ఫోటోలు బయటకు రావడంతో పలువురు వీరు రిలేషన్ లో ఉన్నారని టాక్ వచ్చింది. ఆర్యన్, సాదియా మధ్య ప్రేమ చిగురించిందని.. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇంతే కాదు అటు నోరా ఫతేహా తో కూడా ప్రేమాయణం సాగిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

పాపులర్ ఐటం సాంగ్స్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ నోరా ఫతేహి. ఈ అమ్ముడుతో ఆర్యన్ రిలేషన్ లో ఉన్నాడు అంటూ తాజాగా వార్తలు వచ్చాయి. వారిద్దరు చనువుతో దిగిన ఫోటోలే దీనికి కారణం. కానీ ఆర్యన్ కి 25 ఏళ్లు. కానీ నోరాకి 30 ఏళ్ల వయసు. వీరిద్దరు ఇటేవలే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని దుబాయిలో జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు దిగిన ఫోటోలే వీరి రిలేషన్ ని లవ్ రిలేషన్ గా ముద్రించాయి. దీంతో బాలీవుడ్ సినీ వర్గాలత్లో ఆర్యన్, నోరా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు కోడై కూసాయి.

ఈ ఇద్దరే కాదు నటి అనన్య పాండేతో కూడా రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కాఫీ విత్ కరణ్ షో లో ఈ విషయం అనన్యనే ఒప్పుకుంది. ఆర్యన్ తో ప్రేమలో ఉన్నారా అంటే అవును అతను ముద్దుగా ఉంటాడు, నాకు ఆర్యన్ పై క్రష్ ఉంది. అని చెప్పింది. వీరిద్దరు కలిసి బయట కనిపించడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది. ఇలా ఇప్పటికే ముగ్గురి విషయంలో ఆర్యన్ ఖాన్ గాసిప్స్ ఎదుర్కొన్నాడు. అవి నిజమో కాదో ఎవరూ మాట్లాడలేదు. కానీ సాధియా ఖాన్ ఈ వార్తలపై ఖండించింది. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎలా వార్తలను సృష్టిస్తారు అంటూ ఫైర్ అయింది. ఆర్యన్ తో కలిసి ఫోటో దిగితే రిలేషన్ లో ఉన్నట్టా అంటూ మండిపడింది. ఒక్క ఫోటో చూసి ఇద్దరం డేటింగ్ లో ఉన్నామని ఎలా అనుకుంటారు? వింతగా విచిత్రంగా అనిపిస్తోంది.. అంటూ అసహనం వ్యక్తం చేసింది. కేవలం న్యూ ఇయర్ ఈవెంట్ లో కలిసామని..అప్పుడే మేం ఇద్దరం మాట్లాడుకున్నాం.. అప్పుడే ఫోటో కూడా దిగాం అని తెలిపింది.

ఇలా ఎన్నో రూమర్స్ వస్తే.. సాధియా మాత్రం స్పందించి ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. మరి ఎవరితో రిలేషన్ లో ఉన్నాడో.. ఎవరితో ఎఫైర్ పెట్టుకున్నాడో.. అసలు ఇలాంటివి ఆయన జీవితంలో ఉన్నాయో లేవో అనేవి ఆర్యన్ స్పందిస్తే గానీ తెలియదు.