Vijay Diwas: ఈరోజుకు ఓ ప్రత్యేకత ఉంది. నేటికి సరిగ్గా 50ఏండ్ల క్రితం మన దేశ వీర సైనికులు దాయాది పాకిస్థాన్‌ను యుద్ధంలో ఓడించారు. అందుకే ఈ రోజు మన దేశానికి ఎంతో ప్రత్యేకం. ఆ యుద్ధంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా మన ఇండియా పోరాడి ఆ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. అయితే యుద్ధ వీరులైన సైనికులకు సంబంధించిన సినిమాలు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి.. ఎవరెవరు ఇలాంటి సైనికుల పాత్రల్లో మెరిసారో ఈ సందర్భంగా ఓ లుక్ వేద్దాం.

రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు ది బెస్ట్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు మొదటిసారి సైనికుడి గెటప్‌లో కనిపించి దుమ్ము లేపాడు. ఇక దీనికి ముందు వెంకీ మామ మూవీతో నాగచైతన్య సైనికుడి పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటించారు. ఇక లాల్ సింగ్ చద్ధా మూవీతో మరోసారి సైనికుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీలో సైనికుడిగా నటించి మెప్పించాడు.
ఇక ఆది సాయికుమార్ కూడా ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ మూవీలో సోల్టర్ గా అలరించాడు. ఇక పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ కూడా మెహబూబా మూవీలో ఇలాంటి పాత్రే చేశాడు. సీనియర్ హీరో మోహన్ లాల్, అల్లు శిరీష్ కూడా యుద్ధ భూమి సినిమాలో ఇలాంటి కేరెక్టర్లు చేశారు. ఇక కంచె మూవీతో వరుణ్ తేజ్ కూడా సైనికుడిగా కనిపించాడు. అంతకు ముందు ఘాజీ మూవీలో రానా, ప్రస్తుం తెరకెకకుతున్న మేజర్ మూవీలో అడివి శేష్ టాలీవుడ్ లో సైనికుడిగా మెరుస్తున్నాడు.
Also Read: Pushpa: పుష్ప ఫెస్టివల్‌కు అంతా సిద్ధం.. భారీ సంఖ్యలో థియేటర్లు లాక్
ఇక శక్తి మూవీలో NSG కమెండోగా జూనియర్ ఎన్టీఆర్ మెరిసాడు. ఇక నాని కూడా V మూవీతో సైనికుడి పాత్రలో నటించాడు. ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే గగనం సినిమాలో నాగార్జున మేజర్ గెటప్ లో మెప్పించారు. బాలకృష్ణ కూడా మంగమ్మ గారి మనవడు అలాగే విజయేంద్ర వర్మతో పాటుగా పరమవీరచక్ర మూవీలో ఇలాంటి సైనికుడి పాత్రలోనే కనిపించబోతున్నారు. ఇక రవితేజ చంటి మూవీలో ఇలాంటి పాత్ర చేశాడు. సినిమాలో సైనికుడి పాత్రలో ఒదిగిపోయాడు రవితేజ. ఇలా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చాలామంది హీరోలు సైనికుల పాత్రల్లో మెప్పించారు.
Also Read: Arjuna Phalguna: శ్రీవిష్ణు ‘అర్జున ఫాల్గుణ’ సినిమా విడుదల తేదీ ఖరారు