Happy Days Appu: కొంత మంది నటులు ఫస్ట్ మూవీతోనే ఫేమస్ అవుతారు. దీంతో ఇక వారికి ఇండస్ట్రీలో తిరుగులేదని భావిస్తారు. కానీ అలాంటి వారికి దురదృష్టం తోడవడంతో అవకాశాలు రాక ఎక్కువగా సినిమాల్లో కనిపించరు. కానీ మొదటి సినిమాలో వారి నటనకు పాపులర్ తెచ్చుకున్న వారిని ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోరు. కాలేజ్ ఫ్రెండ్సిఫ్, లవ్ నేపథ్యంలో వచ్చిన హ్యాపీడేస్ మూవీలో ప్రతీ క్యారెక్టర్ ఇంపార్టెంటే. వీరిలో అప్పు పాత్ర బాగా ఫేమస్ అయింది. హ్యాపీడేస్ లో నటించిన అప్పు ఆ తరువాత రెండు, మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించి పిక్స్ రీసెంట్ గా సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆమెను చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ అప్పు ఎలా ఉందంటే?
కొత్త నటులతో చిత్రాలను తీయడం శేఖర్ కమ్ముల హ్యాబీ. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునేవారు శేఖర్ కమ్ములను సంప్రదిస్తే తమ జీవితమే మారుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. వీరిలో కొందరు కొనసాగుతున్నారు. మరికొందరు ఇండస్ట్రీకి దూరమై జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ చిత్రాలు తీసే శేఖర్ కమ్ముల 2007లో మంచి లవ్ స్టోరీని ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చారు. అదే ‘హ్యాపీడేస్’. ఆ రోజుల్లో కళాశాలల్లో జరిగే పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తీయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించిన ఈ సినిమాతో చాలా మంది నటులు వెండితెరకు పరిచయం అయ్యారు.
వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ లు హ్యాపీడేస్ చిత్రంతో పరిచయం బాగా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో అప్పు పాత్ర చేసిన నటి మాత్రం రాణించలేకపోయింది. అప్పు పాత్రలో గాయత్రీరావు అనే అమ్మాయి నటించింది. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న గాయత్రీ రావు ఆ తరువాత గబ్బర్ సింగ్, ఆరేంజ్ సినిమాల్లో కనిపించింది. ఆ తరువాత అవకాశాలు రాకపోవడంతో ఫ్యామిలీ లైప్ లో సెటిల్ అయింది. గాయత్రీ రావు తల్లిదండ్రులు కూడా నటలే. ఆమె తల్లి బెంగుళూరు పద్మగా ఫేమస్ అయ్యారు.
ఇక గాయత్రీ రావు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ జీవితాన్ని కొనసాగిస్తుంది. అయితే హ్యాపీడేస్ సినిమాలో ఎంతో అందంగా ఉన్న ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేకుండా మారిపోయింది. దీంతో ఆమెను చూసి షాక్ అవుతున్నారు. అయితే చాలా మంది నటులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. గాయత్రీ రావు కూడా సినిమాల్లో అవకాశం వస్తే నటించానికి రెడీగా ఉంది. అయితే ఆమెకు ఏ సినిమాలో అవకాశం వస్తుందో చూడాలి.