https://oktelugu.com/

Arya Movie: ఆర్య కథ సుకుమార్ ఎవరి కోసం రాశాడో తెలుసా… బన్నీకి లక్కు అలా కలిసొచ్చింది!

ప్రతిభతో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగారు. ఆర్య మూవీ సుకుమార్ కి మాత్రమే కాదు అల్లు అర్జున్ కి కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్ కి ఒక ఇమేజ్ తెచ్చిన చిత్రం ఇది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 7, 2024 / 05:18 PM IST

    Do you know for whom Sukumar wrote the story of Arya movie

    Follow us on

    Arya Movie: ఆర్య సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతుంది. అప్పట్లో ఈ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది. అప్పటివరకు చూడని ఓ సరికొత్త ట్రయాంగిల్ లవ్ స్టోరీని పరిచయం చేశారు. అద్భుతమైన పాటలతో ఆర్య మూవీ యూత్ ని బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ సుకుమార్ తొలి చిత్రంతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు. వి వి వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సుకుమార్ ఆర్య మూవీ తో దర్శకుడిగా మారాడు. సాలిడ్ హిట్ అందుకున్నారు.

    తన ప్రతిభతో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగారు. ఆర్య మూవీ సుకుమార్ కి మాత్రమే కాదు అల్లు అర్జున్ కి కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్ కి ఒక ఇమేజ్ తెచ్చిన చిత్రం ఇది. తనకు మొదటి హిట్ ఇచ్చిన ఆర్య చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఐకాన్ స్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తన జీవితాన్ని మార్చేసిన సినిమా అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కథకు సుకుమార్ హీరోగా మరొకరిని అనుకున్నాడట.

    అతన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్య కథ రాసారంట. ఆ హీరో ఎవరంటే .. అల్లరి నరేష్. గతంలో ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఈ విషయాన్ని తెలిపారు. అల్లరి సినిమా చూసిన సుకుమార ఆర్య కథ రాసుకున్నారట. ఈ విషయాన్ని సుకుమార్ ఓ సందర్భంలో తనతో చెప్పినట్లు అల్లరి నరేష్ స్వయంగా వెల్లడించాడు. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత బన్నీకి ఛాన్స్ వచ్చిందని ఆయన అన్నారు. అప్పటికే గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ రెండో చిత్రం కోసం చాలా కథలు విన్నాడట. ఏదీ నచ్చలేదట. మంచి కథ కొరకు ఎదురు చూస్తున్న సమయంలో సుకుమార్ ఈ కథ చప్పారట.

    కథ నాకెంతో నచ్చిందని బన్నీ ఒకే చెప్పాడట. అల్లు అరవింద్, చిరంజీవి కూడా కథ విని ఓకే చెప్పడంతో ఆర్య సినిమా పట్టాలెక్కింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఆర్య ఘన విజయం సాధించింది. ఏకంగా రూ. 30 కోట్లు వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో ఇప్పటి మూడు సినిమాలు వచ్చాయి. 2021 లో వచ్చిన పుష్ప పాన్ ఇండియా లెవల్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. హిట్ కాంబోలో వస్తున్న పుష్ప 2 మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపేందుకు సిద్దమవుతుంది.