Vijay Rashmika wedding rules: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు సక్సెస్ ఫుల్ గా రానించి తమకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలని చూస్తుంటారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ప్రతి ఒక్కరు సక్సెస్ లను సాధించడమే వాళ్ల ఏజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు… తెలుగులో ‘గీతా గోవిందం’ సినిమాతో మంచి పాపులారిటిని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందాన జంట ఆన్ స్క్రీన్ మీదే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా పెళ్లి చేసుకొని ఒకట్టవ్వబోతున్నారు. ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని కానీ వీళ్ళిద్దరి ఎప్పుడు అఫీషియల్ గా తమ రిలేషన్ షిప్ గురించి బయట పెట్టలేదనే వార్తలు వచ్చాయి. ఇక గత కొన్ని రోజుల నుంచి ఫిబ్రవరి 26వ తేదీన వీళ్ళ పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చినప్పటికి అవన్నీ పుకార్లని అనుకున్నారు. కానీ 26వ తేదీన వీరిద్దరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ విజయ్ దేవరకొండ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో ఒకసారి గా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక 26వ తేదీన వీరిద్దరి పెళ్లి జరుగుతుంది. పెళ్లిని సైతం హైదరాబాద్ లో కాకుండా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో కొంతమంది పెద్దల సమక్షంలో పెళ్ళయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే ఈ పెళ్ళికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే సినిమా ఇండస్ట్రీ కి చెందిన సుకుమార్, అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగ, రన్బీర్ కపూర్, రాహుల్ సంకృయన్ లాంటి కొంతమంది గెస్ట్లు మాత్రమే హాజరవుతున్నారు. ఇక ఈ పెళ్లికి వచ్చే ప్రతి ఒక్కరికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారట. ఎవరు కూడా ఫోన్లను మండపంలోకి తీసుకురాకూడదని వీడియోలు గాని, ఫోటోలు గానీ తీయకూడదని చెబుతున్నారట.
ఇక సీఎంతో సహా అందరికీ ఈ కండిషన్స్ వర్తిస్తాయని వాళ్ళు చెబుతుండడం విశేషం…ఎందుకంటే తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎక్కడ కనిపించకూడదని వాళ్ళు భావిస్తున్నారట. రష్మిక మందాన గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను కను దిష్టి గురించి చెబుతూ నేను దాన్ని బాగా నమ్ముతాను అని చెప్పింది.
అలా వాళ్ల పెళ్లి ఫోటోలను చూసి జంట చూడ ముచ్చటగా ఉన్నారని కొంతమంది అనుకుంటే కను దిష్టి తగిలి ఏదైనా జరగొచ్చు అనే ఉద్దేశ్యంతోనే ఆమె ఇలాంటి ఫోటోలు వీడియోలకు దూరంగా ఉండాలని చెబుతుందట. అందుకే ఇంతకుముందు ఎప్పుడు విజయ్ రష్మిక కలిసి కెమెరా ముందు కనిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి…