DJ Tillu OTT: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘డీజే టిల్లు’. ఇక ఈ సినిమాకి ‘అట్లుంటది మనతోని’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయిక నటించింది. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగానే.. ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. కాగా ఈ డీజే టిల్లు సినిమా తాజాగా ఓటీటీలో విడుదలైంది.

ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సిద్ధు ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్లవుతుండగా.. డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. నిజానికి ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వగానే.. యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యింది.
Also Read: పవన్ కళ్యాణ్ ముందు చూపు.. ‘భీమ్లానాయక్’ లాభాలతో ఏం చేశాడో తెలుసా?
కాగా మంచి వ్యూస్ తో లైక్స్ అండ్ షేర్లతో ఈ ట్రైలర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అలాగే, సిద్ధు, నేహాశెట్టి మధ్య రొమాంటిక్ సీన్స్ యువతను హుషారెత్తించేలా ఉన్నాయి. సిద్ధు లుక్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ చాలా బాగుంది.

అందుకే.. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతుంది. అదేవిధంగా తమన్ నేపథ్య సంగీతం కూడా బాగా వర్కౌట్ అయింది. మొత్తమ్మీద ‘డీజే టిల్లు’ సినిమా హిట్ తో సిద్దు ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా చాలా బాగా నటించాడు.