Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఎవ్వరూ ఊహించని సంఘటనలు రిపీట్ గా జరుగుతూనే ఉన్నాయి. గత వారం ఎలిమినేట్ అవ్వాల్సిన దివ్య ని, తనూజ తో క్లాష్ పెట్టుకుంటుందేమో, మనకి టీఆర్ఫీ రేటింగ్స్ బద్దలు అయిపోతాయి అనే ఉద్దేశ్యం తో, ఇమ్మానుయేల్ వద్ద ఉన్నటువంటి పవర్ అస్త్ర ని ఉపయోగించి ఎలిమినేషన్ ని రద్దు చేయించారు. కానీ ఈ వారం ఆమె బిగ్ బాస్ టీం అంచనాలను తలక్రిందులు చేసి తనూజ తో గొడవలు రద్దు చేసుకుంది. అంతే కాకుండా ఓటింగ్ కూడా అందరికంటే తక్కువ ఉండడంతో ఈ వారం ఆమె అయితే ఎలిమినేట్ అయిపోయింది. వాస్తవానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టాలని అనుకున్నారు. దివ్య తో పాటు తక్కువ ఓటింగ్ వచ్చిన సుమన్ శెట్టి, సంజన లలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేద్దామని అనుకున్నారు.
కానీ చివరి నిమిషం లో ఏమైందో ఏమో తెలియదు కానీ, డబుల్ ఎలిమినేషన్ ని రద్దు చేశారు. వాస్తవానికి చివరి మూడు స్థానాల్లో సంజన, సుమన్ శెట్టి, దివ్య ఉన్నారు. దివ్య కి వీళ్ళ ముగ్గురిలో తక్కువ ఓటింగ్ వచ్చింది, అదే విధంగా సుమన్ శెట్టి కి సంజన కంటే తక్కువ ఓటింగ్ వచ్చింది. డబుల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ ప్రకారం అయితే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వాలి. కానీ సుమన్ శెట్టి ని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ టీం కి అసలు ఇష్టం లేదు. మొదటి నుండి అతను హౌస్ లో ఏమి చేయకపోయినా బిగ్ బాస్ టీం వీకెండ్ వస్తే చాలు, సుమన్ భజన చేస్తూ లేపుతూ వచ్చింది. ఈ వారం సంజన కి సుమన్ శెట్టి కంటే తక్కువ ఓటింగ్ వచ్చి ఉండుంటే, కచ్చితంగా సంజన ని ఎలిమినేట్ చేసి ఉండేవారు. కానీ ఆమె సేఫ్ జోన్ లో ఉండడం తో సుమన్ శెట్టి ని ఉంచడం కోసం డబుల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ తీసేసారు.
ఇది కాసేపు పక్కన పెడితే దివ్య ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఒకసారి చూద్దాం. కచ్చితంగా ఈమెకు టాప్ 5 లో ఉండేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయి. హౌస్ లో తనూజ, రీతూ చౌదరి కంటే గేమ్స్ విషయం లో కానీ, నామినేషన్స్ సమయం లో పాయింట్స్ పెట్టడం లో కానీ, మనసులో ఉన్న మాటని ఉన్నది ఉన్నట్టు ముఖం మీదనే చెప్పడం కానీ, ఇలా ఏ యాంగిల్ లో చూసినా తోపు కంటెస్టెంట్ దివ్య. కానీ ఈమె భరణి తో బాండింగ్ పెంచుకోవడం, ఆమె వచ్చిన తర్వాత తనూజ భరణి కి దూరం అవ్వడం, భరణి, తనూజ క్యూట్ బాండింగ్ చెడిపోవడానికి కారణం ఈమె అని నిందలు రావడం, దానికి తోడు భరణి ని ప్రతీ చిన్న విషయం లో కమాండింగ్ చేయడం వంటివి ఆడియన్స్ కి నచ్చలేదు. దాని వల్ల ఈమెకు ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదు. కానీ గత వారం తనూజ తో గొడవ పెట్టుకోవడం వల్ల ఈమె ఓటింగ్ బాగానే పెరిగింది. తనూజ ని ద్వేషించే ఆడియన్స్ ఈమెకు ఓట్లు వేశారు. అందుకే బిగ్ బాస్ టీం గత వారం ఈమెని ఎలిమినేట్ చేయకుండా ఒక అవకాశం ఇచ్చింది. కానీ ఈమె మాత్రం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. అందుకే ఇలా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.