The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘రాజా సాబ్’ చిత్రం మరి కొద్దీ గంటల్లో ప్రీమియర్ షోస్ ద్వారా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు దాదాపుగా రెండేళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. ‘కల్కి’ తో ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన ప్రభాస్, ఇంత గ్యాప్ ఇస్తాడని అభిమానులు ఊహించలేదు. గత ఏడాది దసరా లేదా డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, VFX వర్క్ బాగా పెండింగ్ పడడం తో కుదర్లేదు. కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తున్నట్టు, ఈ సినిమా ఇప్పుడు మంచి హైప్ తో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ తో మంచి గ్రాస్ ని నమోదు చేసుకున్న ఈ చిత్రం, ఇండియా లో కూడా ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మంచి గ్రాస్ ని నమోదు చేసుకుంది.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, నిన్న అర్థరాత్రి వరకు ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీమియర్ షోస్ ద్వారా రెండు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నేడు మధ్యాహ్నం నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ నుండి 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వస్తుందని అంటున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే, దిల్ రాజు సోదరుడు శిరీష్, ఒక అభిమానితో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో ఆయన మాట్లాడుతూ ‘నిన్న రాజా సాబ్ సినిమా చూసాను అయ్యా. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాలో ప్రభాస్ నటన చూసి, ఇందులో చేసింది నిజంగా ప్రభాస్ యేనా అని ఆశ్చర్యపోయి మరోసారి వెళ్తారు. అంత అద్భుతంగా నటించాడు. 24 సినిమాల్లో ఆయన నటించిన నటన మొత్తం ఇందులోనే చూపించేసాడు. క్లైమాక్స్ లో హాస్పిటల్ సీన్ ని గుర్తుపెట్టుకోండి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎక్కువ కాలం మాట్లాడుకునే సన్నివేశమది, ప్రభాస్ నటన వేరే లెవెల్ లో ఉంటుంది అందులో’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము, మీరు కూడా వినేయండి. ఆయన చెప్తున్న మాటలు విన్న తర్వాత రాత్రి వరకు ప్రీమియర్ షో కోసం ఎదురు చూడడం కష్టమే ఏమో అని అనిపించక తప్పదు. ఆ రేంజ్ లో ఉన్నాయి ఆ మాటలు.
#TheRajasaab Distributor Leaked Audio Call Hattrick Kodtunam
pic.twitter.com/kh4ORwHrxx— Moyin Prabhas ™ (@_MoyinPrabhas) January 7, 2026