https://oktelugu.com/

హీరో రామ్ కు ఏమైంది?

నవతరం హీరోల్లో హీరో రామ్ కు చాలా యంగ్ అండ్ డైనమిక్ గా ఉంటాడు. చాలా యూత్ ఫుల్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు.. అలాంటి హీరో రామ్ పోతినేని ఒక సంవత్సరానికి పైగా సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్నారు. గత సంవత్సరం మొదటి లాక్డౌన్ కు ముందు “రెడ్” షూటింగ్ ను ముగించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సినిమా కరోనాతో ఆగిపోయింది. ఈ చిత్రం సంక్రాంతి 2021 కోసం విడుదల అవుతుందని చెబుతున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 22, 2021 / 08:02 PM IST
    Follow us on

    నవతరం హీరోల్లో హీరో రామ్ కు చాలా యంగ్ అండ్ డైనమిక్ గా ఉంటాడు. చాలా యూత్ ఫుల్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు.. అలాంటి హీరో రామ్ పోతినేని ఒక సంవత్సరానికి పైగా సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్నారు. గత సంవత్సరం మొదటి లాక్డౌన్ కు ముందు “రెడ్” షూటింగ్ ను ముగించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సినిమా కరోనాతో ఆగిపోయింది.

    ఈ చిత్రం సంక్రాంతి 2021 కోసం విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇక రామ్ ఇటీవల లింగుస్వామి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రారంభించాడు. కానీ సెకండ్ వేవ్ తో ఆ సినిమా కూడా వాయిదా పడింది. రామ్ ఇటీవల కరోనా నివారణ టీకాలు వేసుకున్నాడు. ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అయ్యాడు.

    కొత్త యాక్షన్ థ్రిల్లర్ జూలై మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. రామ్ ఈ చిత్రం కోసం కొత్తగా మేక్ఓవర్ చేయబోతున్నాడు. ఉప్పెన సినిమాతో సంచలనాత్మక అరంగేట్రం చేసిన కృతి శెట్టి ఈ చిత్రంలో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

    శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను పెద్ద బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ముగిశాక రామ్ పోతినేని దర్శకుడు ఎఆర్ మురుగదాస్‌తో మరో చిత్రం చేయడానికి చర్చలు జరుపుతున్నారు.