Disha Patani: హీరోయిన్ దిశా పటాని బోల్డ్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. లేడీ అరేబియన్ గుర్రంలా ఉండే దిశా పటానిని చూస్తే, పుట్టించిన బ్రహ్మకైనా మతి చెదరాల్సిందే. ఫిట్ నెస్ ఫ్రీక్ కావడంతో గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేసి సుందరమైన శరీర ఆకృతి సాధించింది ఈ భామ. మరి కష్టపడి మెరుగులు దిద్దిన అందాలు చూపించకపోతే వారికి విలువేమి ఉంటుంది. అందుకే మొహమాటం లేకుండా సోషల్ మీడియా ద్వారా దిశా రచ్చ చేస్తుంది.
అందుకే, ఆమె ఫాలోవర్స్ కూడా ఆమెను డైరెక్ట్ గానే ‘మేడమ్ కాస్త బికినీ ఫోటో షేర్ చేయండి’ అంటూ కామెంట్స్ పెడుతుంటారు. ఎలాగూ దిశాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వారి కోసం తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ‘ఆస్క్ మీ ఎనిథింగ్ (నన్ను ఏదైనా అడగండి)’ అంటూ ఒక సెషన్ నిర్వహించింది. ఇక హీరోయిన్ తో ముచ్చట్లు అంటే.. కుర్రాళ్ళు ఎందుకు కామ్ గా ఉంటారు.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్
అమ్మడు ఆన్ లైన్ లోకి రావడం ఆలస్యం. ఒక్కో నెటిజన్ ఒక్కో రకంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే, ఈ సెషన్‌లో ఓ యూజర్ అడిగిన ప్రశ్న చాలా బోల్డ్ గా ఉంది. ఈ సెషన్ లో ఆ నెటిజన్ దిశాను ‘బికినీ వేసుకున్న మంచి ఫొటో’ను పోస్ట్ చేయాలి అని డిమాండ్ చేశాడు. అయితే, దిశా మాత్రం బికినీ వేసుకున్న ఒట్టర్ (పాండాలాంటి జంతువు) ఫొటోను పోస్ట్ చేసింది.
ఆ ఫోటో చూసి ఆ నెటిజన్ షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పులువురు నెటిజన్స్ ఈ పోస్ట్ పై రియాక్ట్ అవుతూ.. ‘అయినా దిశా పటాని బికినీ ఫోటోలకు కరువు ఏముంది బ్రో.. గూగుల్ ఓపెన్ చేస్తే ఎన్ని కావాలో అన్ని దొరుకుతాయి కదా’ అని ఒకరు.. దిశా స్పాంటెనిటీకి ఫిదా అయ్యాం అని మరొకరు ఇలా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో దిశాను హీరోయిన్ చేశాడు. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీ అయ్యింది అమ్మడు. బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ వైపు ఆసక్తి చూపడం లేదు. పుష్ప మూవీలో సమంత చేసిన ఊ అంటావా.. ఐటెం సాంగ్ కోసం దిశాను సంప్రదించగా చేయను అంది.
Also Read: ఎత్తరజెండా పాటను కూడా వదలని సజ్జనార్.. ఇలా వాడేశాడే