
Kisi Ka Bhai..Kisi Ka Jaan : బాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తెచ్చిపెట్టే ఇద్దరు ముగ్గురు మెగాస్టార్స్ లో ఒకడు సల్మాన్ ఖాన్.ఈయన సినిమా వస్తుందంటే చాలు బాలీవుడ్ మాస్ ఆడియన్స్ కి ఒక పండుగ.అయితే గత కొంతకాలం నుండి సల్మాన్ ఖాన్ కి సరైన సూపర్ హిట్ లేదు,ఇది ఆయన మార్కెట్ పై ప్రభావం చూపించిందని ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తే అర్థం అయిపోతుంది.
ఈ నెల 21 వ తారీఖున ఈద్ పర్వదినం ని పురస్కరించుకొని విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్స్ దక్కుతాయని బాలీవుడ్ ట్రేడ్ ఆశించింది.ఎందుకంటే ఈద్ పర్వదినం రోజు విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమాలకు ఓపెనింగ్స్ ఇది వరకు కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చాయి.కానీ ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రానికి ఆ రేంజ్ ఓపెనింగ్ దక్కే ఛాన్స్ లేదని తెలుస్తుంది.
ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఈమధ్యనే ప్రారంభించగా, కనీసం యావరేజి రేంజ్ లో కూడా టికెట్స్ సేల్ కాకపోవడం బాలీవుడ్ ట్రేడ్ ని విస్మయానికి గురి చేసింది.సల్మాన్ ఖాన్ లాంటి మెగాస్టార్ కి ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడూ చూడలేదని,మొట్టమొదటిసారి ఇంత వీక్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తున్నామని చెప్తుంది బాలీవుడ్ ట్రేడ్.దీనికి కారణం సల్మాన్ ఖాన్ ఫామ్ లో లేకపోవడం ఒకటైతే, మరొకటి రీమేక్ అనే ప్రచారం.
తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘కాటమరాయుడు’ అనే చిత్రానికి ఇది రీమేక్ అనే విషయం టీజర్ మరియు ట్రైలర్ చూసే పార్తీ ఒక్కరికి అర్థం అయ్యిపోతుంది.సోషల్ మీడియా లో దీనిపై చాలా నెగటివ్ ప్రచారం కూడా జరిగింది.దాని ప్రభావమే అడ్వాన్స్ బుకింగ్స్ పై పడిందని అంటున్నారు విశ్లేషకులు.ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మొదటి రోజు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.