Director Prashanth News : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో మన స్టార్ హీరోలు మొదటి స్థానంలో ఉండడం విశేషం…ఇక తెలుగులో మెగా ఫ్యామిలీకి ఎనలేని గుర్తింపైతే ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఎంతమంది హీరోలనుంచి పోటీ ఎదురైనప్పటికి ఆయన ఎప్పటికప్పుడు మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. గత 50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానం చాలా గొప్పగా ఉందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు ఆరుగురు హీరోలు ఇండస్ట్రీలో ఉండటం విశేషం. ఇక వాళ్ల నుంచి వచ్చే ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక సంవత్సరంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోల సినిమాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… అయితే మెగా మేనల్లుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ చేసిన సినిమాలు సైతం అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చి పెడుతున్నాయి. ఈయన కెరియర్ స్టార్టింగ్ లో కన్నడ సినిమా స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సైతం అతడితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేశారట.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేసింది..ఊహకందని విజువల్స్..ఇంత భారీగా ఉంటుందని ఊహించలేదుగా!
కానీ సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) అప్పుడు ఇతర సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ప్రశాంత్ నీల్ కి డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేకుండా పోయాయి. కానీ ఆ తర్వాత కాలంలో ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ (KGF) లాంటి సినిమాలను చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట కూడా ఆయన భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మాత్రం చాలా వరకు నిరుత్సాహపడుతున్నారు.
ఎందుకంటే సాయిధరమ్ తేజ్ కనక ఆ సినిమా చేసి ఉంటే అతనికి గొప్ప గుర్తింపు వచ్చి ఉండేదని వాళ్ళు అభిప్రాయ పడుతున్నారు… ఆయనతో కనుక సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా చేసి ఉంటే స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయేవాడు అని తను కూడా ఇప్పుడు కొంతవరకు రీ గ్రేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది…