Vijayendra Prasad: తెలుగు సినిమా స్థాయిని పెంచిన రైటర్లలో విజయేంద్రప్రసాద్ ఒకరు. ఈయన రాసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈయన మొదట రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన జానకి రాముడు లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకి కథను అందించాడు. ఇక ఆ తర్వాత కూడా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి సినిమాకి కూడా ఆయన కథను అందించడం విశేషం…
ఇక ఆ తరహా లోనే ఆయన రాజమౌళితో చేసిన ప్రతి సినిమాకి కథను ఇవ్వడమే కాకుండా రాజమౌళి ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవడంలో ఈయన అందించిన కథలు కీలక పాత్రను వహించాయి… అయితే విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ చేసిన కొన్ని సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దాంతో ఆయన డైరెక్షన్ చేయకుండా రైటర్ గా మాత్రమే ముందుకు సాగుతున్నాడు.ఈయన ‘ రాజన్న ‘ సినిమాని చాలా బాగా తీశాడు.
అయితే ఈ సినిమాను చూసిన రాజమౌళి మీరు తీసిన మొదటి సినిమా కంటే ఈ సినిమాలో డైరెక్షన్ చాలా బాగా చేశారు అని అప్రిషెట్ చేశారట. ఇక ఇదిలా ఉంటే ఆయన ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరోసారి ‘శ్రీవల్లి'(Srivalli)అనే సినిమాని తెరకెక్కించాడు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చినప్పటికీ ఈ సినిమా ప్లాప్ అయింది. ఇక ఈ సినిమాని చూసిన రాజమౌళి మీ డైరెక్షన్ చాలా చెత్తగా ఉంది.
మీరు డైరెక్షన్ కి పనికిరారు అని మొహం మీదే చెప్పేశారట. ఇక దాంతో విజయేంద్రప్రసాద్ మరోసారి డైరెక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయడం లేదు. అలా రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ మధ్యలో సినిమాకు సంభందించిన ఏ విషయాన్నైనా వాళ్లు ఇలా స్ట్రైట్ గా మాట్లాడుకుంటూ ఉంటారట..ఇబ్బంది పడతారేమో, బాధపడతారేమో అనే ఫీలింగ్స్ ఏం లేకుండా సినిమాల పరంగా అయితే చాలా నిక్కచ్చి గా ఒకరి అభిప్రాయాల్ని మరొకరు చెప్పుకుంటూ ఉంటారట… ఇక మొత్తానికైతే రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ కి ఒక పెద్ద క్లాస్ పీకాడట…