Director Teja: డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాకి చాలా ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. నితిన్ హీరోగా చేసిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో మంచి విజయాలను అందుకున్న నితిన్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాపులను మూట గట్టుకుంటున్నప్పటికి ఆయన చేస్తున్న సినిమాలతో తప్పకుండా సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం… ఇక జయం సినిమాలో ‘బండి బండి రైలు బండి’ అనే పాట లిరిక్స్ అప్పట్లో కాంట్రవర్సీ అయిన విషయం మనందరికి తెలిసిందే. అయితే రైలు ను ఉద్దేశిస్తూ కొన్ని నెగెటివ్ లిరిక్స్ రాశారు. దాంతో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ సినిమా యూనిట్ కి నోటీసులు రావడంతో ఫైనల్ గా సినిమాలో లిరిక్స్ మొత్తం మార్చి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా లిరిక్స్ ను సెట్ చేశారు.
ఇక ఈ విషయం మీద డైరెక్టర్ తేజ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటి ఇచ్చాడు. కారణం ఏదైనా కూడా గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని విషయాలను సినిమాల్లో బ్యాడ్ గా చూపిస్తే ఒప్పుకోరని దానివల్ల గవర్నమెంట్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ లిరిక్స్ ను చేంజ్ చేయమని చెప్పడంతో మేము అదే పని చేశాం అంటూ తేజ క్లారిటి ఇచ్చాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రేమ కథతో ఈ సినిమా తెరకెక్కిన విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. హీరో, హీరోయిన్, విలన్ ఇలా ప్రతి క్యారెక్టర్ కూడా హైలెట్ గా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ఇక ఈ సినిమా దర్శకుడైన తేజ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా తన నుంచి వస్తున్న సినిమాల విషయం ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…