
`ఆర్యా` సినిమా తో మొదలైన సుకుమార్ జర్నీ తెలుగు చిత్రాల్లో ఒక కొత్త వరవడి కి నాంది పలికింది . సినిమా, సినిమాకి జానర్ మారుస్తూ సుకుమార్ చేసే ప్రయోగాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతున్నాయి . “100 % లవ్ , నాన్నకు ప్రేమతో , రంగస్థలం ” వంటి చిత్రాలు విభిన్నతకు పెద్ద పీట వేయడమే గాక ఘం విజయం కూడా సాధించాయి. ఇక మహేష్ బాబు హీరో గా తీసిన ` వన్ నేనొక్కడినే `ఆర్ధికంగా ఫెయిల్ అయినా విమర్శకుల ప్రశంసలు దక్కించు కొంది. హాలీ వుడ్ తరహా మేకింగ్ తో సుకుమార్ అందర్నీ ఆశ్చర్య పరచడం జరిగింది.
మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న ” పుష్ప ” చిత్రం పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతోంది. గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం సుకుమార్ కెరీర్ లో మరో విభిన్న చిత్రం కాబోతుంది. అయితే ఈ సినిమాకి ముందు మహేష్ బాబు తో సినిమా చేద్దామనుకున్న సుకుమార్ తెలంగాణ సాయుధ పోరాట నేపధ్యం లో ఓ విభిన్న కథని రెడీ చేసాడట… కానీ మహేష్ బాబు కి ఆ కథ సూట్ అవ్వదని అనిపించి ఇపుడు తీస్తున్న `పుష్ప ` సినిమా కథ చెబితే మహేష్ బాబు కి నచ్చలేదట దాంతో ఈ సినిమాని బన్నీ తో తెరకెక్కిస్తున్నాడు .