Director Sukumar: ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన దర్శకులలో ఒకరు సుకుమార్.పుష్ప సినిమాతో ఈయన సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. తెలుగు తో పాటుగా హిందీ , తమిళం , కన్నడ మరియు మలయాళం బాషలలో సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా లెవెల్ లో ఊర మాస్ హీరో గా నిలబెట్టింది. అలాంటి చిత్రానికి ప్రస్తుతం ఆయన ‘పుష్ప:ది రూల్’ పేరుతో సీక్వెల్ చేస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గత కొంత కాలం నుండి విరామం లేకుండా సాగుతుంది.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి విడుదల చేసిన మొట్టమొదటి గ్లిమ్స్ మరియు ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ, ఇటీవల డైరెక్టర్ సుకుమార్ ఇంటి పై ఐటీ అధికారులు దాడి చెయ్యడం ఇండస్ట్రీ లో కలకలం సృష్టించింది.
సుకుమార్ బ్యాంక్ అకౌంట్ నుండి చాలా డబ్బు విదేశీ అకౌంట్స్ కి వెళ్లిందని, ఇది బ్లాక్ మనీ అంటూ ఐటీ అధికారులకు సమాచారం వెళ్లడం తో వాళ్ళు వెంటనే సుకుమార్ ఇంటి పై మరియు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ పై సోదాలు నిర్వహించారు. ఈ సోదాల అనంతరం ఆరోపణలకు తగ్గట్టుగా ఐటీ అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. టాక్సులన్నీ పర్ఫెక్ట్ గా కట్టినట్టు లెక్కలు కూడా ఉన్నాయి.
అయితే సుకుమార్ ఈ ఐటీ దాడుల పట్ల ఆయన మనసు చాలా నొచ్చుకుందట. ఇంత నిజాయితీ గా ఉంటున్నప్పటికీ నా మీద కక్ష తో టాలీవుడ్ లో ఎవరో ఈ అసత్య సమాచారాన్ని ఐటీ అధికారులకు పంపారని, ఇది తనని ఎంతో మానసిక వేదనకు గురి చేస్తుంది అంటూ సుకుమార్ నిర్మాతతో అన్నాడట. ఇప్పుడు ఉన్న పరిస్థితి లో తాను షూటింగ్ చేయలేనని, కనీసం రెండు వారాలు బ్రేక్ కావాలని కోరాడట. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.