Srinu Vaitla: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తనదైన మార్క్ ఎంటర్ టైనర్ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీను వైట్ల. సొంతం, ఢీ, రెడీ, దూకుడు, పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి… ఆయా హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ లను అంధించిన ఘనత శ్రీను వైట్లదే. అయితే ఇటీవల కాలంలో ఆయన అంతా ఫామ్ లో లేరనే చెప్పాలి. మహేశ్ బాబు తో తీసిన “ఆగడు” డిజాస్టర్ కావడంతో… కొంతకాలం గ్యాప్ తీసుకొని రవితేజతో ఓ మూవీ చేశారు.

అమర్ అక్బర్ ఆంటోని గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే తాజాగా ఈ టీవి ఛానల్ లో ఆలీ వ్యాఖ్యాతగా చేస్తున్న ” ఆలీతో జాలీగా ” ప్రోగ్రాంకు శ్రీను వైట్ల హాజరయ్యారు. ఈ సంధర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు శ్రీను వైట్ల. ‘నీకోసం’ తో డైరెక్టర్ గా శ్రీను వైట్ల ఇండస్ట్రి లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాను చూసిన ప్రముఖ నిర్మాత రామోజీరావు… మీరు సినిమా బాగా తీశారు కచ్చితంగా మన బ్యానర్‌లో ఛాన్స్ ఇస్తా అని మాట ఇచ్చారంట.
ఆ మేరకు ‘ఆనందం’ మూవీ ఛాన్స్ ఇచ్చారని స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల తెలిపారు. మంచి రోజు చూసి షూటింగ్ మొదలు పెడతాను సర్’ అని రామోజీ రావు గారితో అంటే… మీరు చెడ్డ రోజు చూసి మొదలు పెట్టండి ఎందుకు ఆడదో చూస్తా అని సరదాగా బదులిచ్చారని శ్రీనువైట్ల చెప్పారు. ఇక తన సినిమాల్లో కచ్చితంగా మందు కొట్టే సన్నివేశం గురించి అడగగా… దూడుకులో మందుకొట్టే సీన్ లేదని తెలిపారు. మహేశ్‌బాబు కావాలని ఆ సీన్ పెట్టించుకున్నారు అని సమాధానం ఇచ్చారు. ఈ షో లో ఆలీ – శ్రీను వైట్ల మధ్య పలు ఆసక్తికర సంభాషణలు జరిగాయి. అవి తెలియాలంటే నవంబరు 8 వరకు ఆగాల్సిందే.