Sandeep Reddy Vanga meets Revanth Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికీ లేనటువంటి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇప్పటికైనా అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఆయనకు ఇండస్ట్రీలోను గొప్ప దర్శకుడిగా పాన్ ఇండియా గుర్తింపును సంపాదించుకున్నాడు. స్పిరిట్ సినిమాతో మరోసారి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఎవ్వరికి ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే దర్శకులలో సందీప్ రెడ్డి వంగ కు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి సందీప్ రెడ్డివంగా చేసే సినిమాల్లో భారీగా కొత్తదనం ఉండడమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే యూత్ అందరిని అట్రాక్ట్ చేస్తూ ఆయన చేయబోతున్న సినిమాలు సైతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెట్టుకున్నాయి.
ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని కలిసిన విషయం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి సీఎంను కలవడానికి గల కారణం ఏంటి అంటే సందీప్ రెడ్డివంగ వాళ్ళ అన్నయ్య ప్రణయ్ రెడ్డి ఇద్దరు కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ మీద పది లక్షల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
దానికి కారణం ఏంటి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పేదవాళ్లకు ఏదైనా సాయం అందించాలనే ఉద్దేశ్యంతో విపరీతమైన సమస్యల్లో ఉన్న వాళ్లకు ఆ డబ్బులు యూస్ అవుతాయి అనే ఉద్దేశ్యంతో దానిని సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించినట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా సందీప్ రెడ్డివంగా నుంచి రాబోయే సినిమాలు మాత్రం సూపర్ సక్సెస్ లను సాధించబోతున్నట్టుగా తెలుస్తున్నాయి…
ఇక ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇప్పుడు చేస్తున్న స్పిరిట్ సినిమా ఎలా ఉంటుంది ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకోబోతోంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…