పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన ‘పింక్’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెల్సింది. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఆఫిషియల్ గా అనౌన్స్ చేశారు. రెండేళ్ల నుంచి పవన్ కల్యాణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు తాజా అప్డేడ్ మరింత ఉత్సాహాన్నిచ్చింది. ‘వకీల్ సాబ్’ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ అభిమానులు షేర్ చేస్తుండటంగా ట్రెండింగ్ మారింది. పవన్ ‘వకీల్ సాబ్’ పోస్టర్ పై దర్శకుడు రామగోపాల్ వర్శ తన శైలిలో స్పందించాడు.
‘వకీల్ సాబ్’ పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్టిల్ ఇచ్చాడో అదేవిధంగా వర్మ ఫోజిచ్చాడు. తన పోస్టరపై ‘డైరెక్టర్ సాబ్’ అని టైటిల్ వేసుకున్నాడు. ఆ పోస్టర్ చుసిన తరువాత పవర్ ఫాన్స్ వర్మపై మండిపడుతున్నారు. వర్మ గురించి తెసివాళ్లు మాత్రం ‘ఎవరిని వదలడు… దేనిని వదలడు’ అంటూ కామెంట్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్ మాత్రం వైరల్ అవుతున్నాయి.
రామ్ గోపాల్ వర్మ ఇటీవల ‘దిశ’ మూవీని ప్రారంభించాడు. తెలంగాణలో కలకలం రేపిన దిశ ఘటనపై సినిమా తీస్తున్నాడు. సమాజంలో జరిగే విషయాలపై తనదైన శైలిలో రాంగోపాల్ వర్మ స్పందిస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ టైటిల్ పై వర్మ తనదైన రీతిలో స్పందించాడు. తన అభిమాన హీరోపై రాంగోపాల్ వర్శ పంచ్ లు వేయడంపై ఆయనకు పవన్ అభిమానులు వార్నింగ్ ఇస్తున్నాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాంగోపాల్ వర్శ పవన్ రీఎంట్రీ మూవీపై కాంట్రవర్సీకి తెరలేపడంతో ‘వకీల్ సాబ్’ మూవీపై మరింత హైప్ పెరిగింది.