Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘హరి హర వీరమల్లు’.లవ్ స్టోరీస్ మరియు మాస్ మూవీస్ తో ఇన్ని రోజులు అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మొదటిసారి కెరీర్ లో పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు.సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతునన్ ఈ సినిమా మొఘల్ కాలం లో ఓరంగజేబు పరిపాలిస్తున్న పీరియడ్ ని ఆధారంగా చేసుకొని తీస్తున్న ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా.

ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు గ్లిమ్స్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది.సినిమాలో పవన్ కళ్యాణ్ లేని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తుంది.
అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందట.ఇక కేవలం పవన్ కళ్యాణ్ ఒక 30 రోజులు కాల్ షీట్స్ ఇస్తే సినిమా పూర్తి అవుతుందని సమాచారం.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఈ సినిమా షూటింగ్ మార్చి 12 వ తేదీ వరకు కొనసాగుతుంది.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ కోసం 20 రోజుల డేట్స్ ని కేటాయించాడు.
ఈ చిత్రం లో రీసెంట్ గానే ప్రముఖ బాలీవుడ్ టాప్ హీరో ‘బాబీ డియోల్’ ఓరంగజేబుగా నటిస్తున్నాడు.ఈమధ్యనే ఆయనపై ముంబై లోని ND స్టూడియోస్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.ఇప్పటికే వంద రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందని ఫిలిం నగర్లో గట్టిగా టాక్ వినిపిస్తుంది.ఎట్టిపరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేసునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.