Bangarraju : ‘బంగార్రాజు’ గురించి కళ్యాణ్ కృష్ణ ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు !

  Kalyan Krishna  media chit chat  : అక్కినేని నాగార్జున న‌టించిన  “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్  బంగార్రాజు   సినిమా  సంక్రాంతి రేసులో ఉంది.  ప్రస్తుతం  కరోనా ఊపు ఎక్కువగా ఉంది కాబట్టి.. సినిమా  పోస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం ఉంది.  ఇంకా పోస్ట్ ఫోన్ కాలేదు కాబట్టి.. సినిమా టీం మాత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.  తాజాగా ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మీడియాతో ముచ్చటించారు.  మరి ఆ విషయాలు ఏమిటో చూద్దాం.     […]

Written By: Raghava Rao Gara, Updated On : January 8, 2022 7:17 pm
Follow us on

 

Kalyan Krishna  media chit chat  : అక్కినేని నాగార్జున న‌టించిన  “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్  బంగార్రాజు   సినిమా  సంక్రాంతి రేసులో ఉంది.  ప్రస్తుతం  కరోనా ఊపు ఎక్కువగా ఉంది కాబట్టి.. సినిమా  పోస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం ఉంది.  ఇంకా పోస్ట్ ఫోన్ కాలేదు కాబట్టి.. సినిమా టీం మాత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.  తాజాగా ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మీడియాతో ముచ్చటించారు.  మరి ఆ విషయాలు ఏమిటో చూద్దాం.  

 

 కళ్యాణ్ కృష్ణ మాటల్లోనే..  ‘నేను  నాగార్జున గారికి 2014లో  సోగ్గాడే కథను చెప్పాను.  2016లో సోగ్గాడే రిలీజ్ అయింది. ఆ రోజే బంగార్రాజు సినిమా   చేయాలని నిర్ణయించుకున్నాం.   అయితే,  మధ్యలో చైతన్యతో ఓ సినిమాను తీయమన్నారు.    నాగార్జున గారికి నాకు మధ్య  మొదటి నుంచి  మంచి  ర్యాపో ఉంది. ప్రతీ విషయంలో ఆయన నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు.  మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ కూడా బాగుంటుంది. 

 

 

 

 ఇక  సోగ్గాడే ఎక్కడ ఎండ్ అయిందో.. బంగార్రాజు అక్కడ మొదలవుతుంది.  జనరేషన్ తేడా ఉంటుంది తప్పా బంగార్రాజు పాత్రలో తేడా ఉండదు. బంగార్రాజు మనవడిగా చైతూ కనిపించబోతున్నాడు.  పెద్ద బంగార్రాజు పాత్ర ఎలా ఉండేదో.. చిన్న బంగార్రాజు పాత్ర కూడా అలాగే ఉండబోతుంది.  జీవితంలో మూడు దశల్లో ఉండే ప్రేమ కథతో ఈ  సినిమా అనుకోవడం జరిగింది. 

 

 

అందులో యంగ్ పాత్రలో నాగ చైతన్య, మిగిలిన పాత్రలో నాగార్జున గారు కనిపించబోతున్నారు.   కథ అయితే చాలా బాగా వచ్చింది. కానీ  అనుకున్న సమయానికి ఈ సినిమాను తీయడమే  మాకు పెద్ద సవాల్‌ గా అనిపించింది.  కారణం ఈ సినిమాకు  వీఎఫ్ఎక్స్‌ కు  చాలా ఎక్కువ సమయం  పట్టింది.  రిలీజ్ విషయానికి వస్తే   ముందు నుంచి సంక్రాంతికి అనుకున్నాం. కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.  

 

 

ఇక  నాగార్జున, నాగ చైతన్య పాత్రలు సమానంగా ఉంటాయి. దీనికి సీక్వెల్ ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేను.  నా  తర్వాత సినిమా విషయానికి వస్తే..  నిర్మాత జ్ఞానవేల్ రాజా గారితో ఓ సినిమా ఉంటుంది.   హీరోను బట్టి ద్విభాషా చిత్రం గా ఉండొచ్చు.   నాకు అయితే.. ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఓ కోరిక ఉంది. 

http://twitter.com/iamnagarjuna/status/1478370677602152449