Gopichand Malineni- RK: వాచ్ పెట్టుకున్న ప్రతీ వ్యక్తి టైం బాగుండాలనేం లేదు. యాదృచ్ఛికంగా ఒక వాచ్ మన చేతికి వచ్చి…టైం ఆటో మేటిగ్ గా మన వైపు టర్న్ తీసుకుంటే వచ్చే కిక్ వేరు. ప్రస్తుతం ఆ కిక్ నే అనుభవిస్తున్నారు గోపిచంద్ మలినేని. అంతటి కోవిడ్ టైం లో రవితేజ తో క్రాక్ తీసి, సంక్రాంతికి రిలీజ్ చేసి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన గోపీచంద్.. బాలయ్య కు ఈ సంక్రాంతి అఖండ ను మించిన హిట్ ను వీరసింహా రెడ్డి రూపంలో ఇచ్చాడు. అంతేకాదు బాలయ్య ను ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు. సక్సెస్ అయినవాళ్ళకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది కాబట్టి… గోపీచంద్ మలినేని ని ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేశారు.. ఈ సందర్భంగా పలు విషయాలను గోపీచంద్ మలినేని పంచుకున్నారు.

చిరంజీవి ఇచ్చారు
గోపీచంద్ మలినేని చూసేందుకు రవితేజ మాదిరి కనిపిస్తారు. సెట్ లో ఉన్నప్పుడు కొన్ని షాట్స్ ను ఈయన మీదే తీసేవారు.. రవి తేజ కూడా గోపీచంద్ ను ఎంకరేజ్ చేసేవారు. గోపీచంద్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చిరంజీవి ” బక్క రవితేజ” అని పిలిచేవారు. గోపీ చంద్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి వాచ్ ను బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ” ఇక నుంచి నీ టైం బాగుంటుంది అని” దీవించారు..అప్పుడు చిరంజీవి వెంట అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఇక అప్పటి నుంచి గోపీచంద్ వెను తిరిగి చూసుకోలేదు.. డాన్ శీను,బలుపు, క్రాక్, వీర సింహారెడ్డి వంటి హిట్లతో ఇండస్ట్రీ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
ప్రేమకు ఎన్ని అడ్డంకులో..
గోపీచంద్ పెళ్లి కూడా సినిమా టిక్ గా జరిగింది. పెద్దమ్మ గుళ్ళో ఒక అమ్మాయిని చూసి గోపీచంద్ ఇష్ట పడ్డాడు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక గోపీచంద్ ఇంటర్ కూడా పాస్ కాలేదు. నేటికీ బ్యాక్ లాగ్స్ అలానే ఉన్నాయి. తాను చదువుకున్న కాలేజీ పక్కన మూడు థియేటర్లు ఉండడంతో కాలేజీ కి బంక్ కొట్టి సినిమాలు చూసేవాడు. గోపిచంద్ తండ్రికి కూడా సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండేది. చివరకు టిఫిన్ కట్టించే న్యూస్ పేపర్ లోనూ సినిమా వార్తలను చదువుతూ ఉండేవారు.
తగలాల్సిన వాళ్లకు తగిలాయి
వీర సింహా రెడ్డి లో బాలయ్య పలికే డైలాగ్ లు ఓ వర్గానికి కౌంటర్ గా ఉంటాయి. ” పేరు మార్చినంత మాత్రాన చరిత్ర మారదు” ” మూతి మీద మొలిచే ప్రతీ బొచ్చు మీసం కాదు” ఇలా కొన్ని మాటలు ఓ వర్గానికి తగిలేలా ఉంటాయి. దీనిపై అసలు విషయాలు రాబట్టేందుకు ఆర్కే ప్రయత్నించగా…ఆ మాటలు కావాలని రాసినవి కాదని గోపీచంద్ చెబుతూనే నవ్వారు.

క్రాక్ విషయంలో తప్పిదం
రా సినిమాలు తీయడంలో సుప్రసిద్దులైన తమిళ దర్శకులకు పోటీగా గోపీచంద్ క్రాక్ అనే సినిమా తీశారు. ఇందులో కటారి కృష్ణ నేరస్తుడి జీవిత చరిత్ర ను వాడుకున్నారు. అయితే ఈ సినిమాను ఆర్కే చాలా ఇష్టంగా చూశారు. ఈ సినిమాను కటారి కృష్ణ చూశారా అని అడిగితే… “చూశారు.. బాగుందని చెప్పారు.. కానీ జయమ్మను చంపింది నేను కాదు కదా అని నవ్వేశారని” గోపీచంద్ సంచలన విషయాన్ని వెల్లడించారు.
మైత్రి వాళ్ళు తప్ప అందరూ ఎగ్గొట్టారు
ఇక రెమ్యూనరేషన్ విషయంలో గోపీచంద్ ను అందరు నిర్మాతలు మోసం చేశారు. క్రాక్ సినిమా ఆ స్థాయిలో హిట్ అయినప్పటికీ ఆ చిత్ర నిర్మాత గోపీచంద్ కు సరిగా డబ్బులు ఇవ్వలేదు. దీనిపై గోపీచంద్ కూడా ఆ నిర్మాతను మళ్లీ అడగలేదు. కానీ ఈ విషయంలో మైత్రి మూవీస్ సంస్థ వాళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గోపీచంద్ కు పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చారు.